- కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని స్వీకరించారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. తెదేపా నేతల గృహ నిర్బంధం
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన దృష్ట్యా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొవిడ్, ఎన్నికల నియమావళి అమలు కారణం చూపుతూ.. తెదేపా నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నామినేషన్లకు మరో అవకాశం..!: ఎస్ఈసీ
బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిందనే ఫిర్యాదులపై కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాయని.. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. పురపాలక ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంద్రకీలాద్రిపై అక్రమార్కుల రాజ్యం...ఏటా రూ.కోట్లలో ఆదాయానికి గండి
కనకదుర్గమ్మ స్వయంగా అవతరించిన ఇంద్రకీలాద్రిపై..అడుగడుగునా అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. భద్రత, టోల్‌గేట్లు, పారిశుద్ధ్యం, ఇలా ఏ టెండర్లలోనూ పద్ధతిని పాటిస్తున్నట్లు కనిపించదు. వీటన్నింటికీ తోడు లెక్కలే నన్ని వివాదాలు, భరించలేనన్ని ఘోరాలు. ఇవన్నీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అంతర్జాతీయ రోదసి హబ్‌గా భారత్ ఎదుగుతుంది'
అమెరికాలోని ఏరోస్పేస్ తయారీ, అంతరిక్షయాన సేవల కంపెనీ ‘స్పేస్‌ఎక్స్’ తరహాలో మనదేశంలోనూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు కీలకపాత్ర పోషించే రోజు ఎంతో దూరంలో లేదని హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు అన్నారు. పీఎస్‌ఎల్‌వీ- సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్తులో ప్రైవేటు రంగానికి ఈ విభాగంలో లభించే అవకాశాలు, హైదరాబాద్‌కు దక్కే ప్రయోజనాలు వంటి పలు అంశాలపై ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు. ఆ విషయాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- 'భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా'
భార్యాబిడ్డలను కాపాడుకునేందుకు గత సోమవారం.. చిరుతతో భీకరంగా పోరాడి గెలిచాడు కర్ణాటకకు చెందిన రాజగోపాల్ నాయక్. ఆయన చూపిన తెగువను అందరూ ప్రశంసించారు. స్థానికులు ఆయన్ను ఆధునిక హొయ్సళగా కొనియాడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చమురు సంస్థల షాక్- సిలిండర్ ధర రూ.95 పెంపు
వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ.1,614 వద్దకు చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్- పాక్‌ను అలా చూడాలన్నదే నా కల: మలాలా
భారత్, పాకిస్థాన్‌లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నారని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ చెప్పారు. రెండు దేశాలూ నిజమైన స్నేహితుల్లా మారితే చూడాలన్నదే తన కల అని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడిక్కల్ జోరు.. వరుసగా మూడు శతకాలు
విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ చెలరేగిపోతున్నాడు. వరుసగా మూడు సెంచరీలు చేసి జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. మొత్తంగా 5 మ్యాచుల్లో 190.66 సగటుతో 572 పరుగులు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బెల్లంకొండ సరసన హీరోయిన్ దిశా పటానీనే!
హిందీ ఛత్రపతి రీమేక్‌లో హీరోయిన్గా దిశా పటానీనే ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.