ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

.

author img

By

Published : Oct 24, 2020, 9:00 AM IST

Updated : Oct 24, 2020, 9:09 AM IST

9am top news
ప్రధాన వార్తలు
  • విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ సిబ్బంది

విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద కొన్ని కట్టడాలను....రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధానద్వారం, ప్రహరీగోడను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరిలో నీటి వాటాను తేల్చేందుకు గోదావరి ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇందుకోసం తమ ప్రతిపాదనలు పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి కోరారు. ఈ విషయంలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదన పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తెలుగు రాష్ట్రాలకు పంపిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పోలవరం పెండింగ్‌ నిధుల విడుదలకు కేంద్రం షరతు?

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన... దిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యాక కూడా పోలవరం నిధులపై గట్టి హామీ లభించలేదని సమాచారం. 55వేల కోట్ల తొలి డీపీఆర్ కాకుండా, 20వేల కోట్లతో రెండో డీపీఆర్​ను పీపీఏ ఆమోదిస్తేనే.... ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన 2వేల 234 కోట్లయినా వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఆర్థికశాఖ, జలవనరులశాఖ అధికారులతో సీఎం జగన్‌ నేడు చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంటర్​ సీటు దక్కేదెలా?

ఇంటర్​ ఆన్​లైన్​ ప్రవేశాల్లో తాము కోరుకునే కళాశాలలో సీట్లు కనిపించకపోవటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఆసక్తి చూపే కళాశాలలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో చాలా మంది కళాశాల ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముఫ్తీ 'జెండా' వ్యాఖ్యలపై భాజపా ఫైర్​

జాతీయ జెండాపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి భాజపా, కాంగ్రెస్​. కశ్మీర్​ ప్రత్యేక జెండా తమ చేతికి వచ్చాకే.. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేస్తామనటం.. దేశ ద్రోహమే అవుతుందని పేర్కొంది భాజపా. ముఫ్తీని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేసింది. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొంది కాంగ్రెస్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 35 ఏళ్ల తర్వాత భారత్​కు ఐఎల్​ఓ పీఠం

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పాలక మండలి అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అపూర్వ చంద్ర ఎన్నికయ్యారు. ఈ మేరకు భారత కార్మిక శాఖ వెల్లడించింది. 35ఏళ్ల తర్వాత ఐఎల్‌ఓ పాలకమండలి అధ్యక్ష స్థానం భారత్​కు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అంతర్గత విజయాలతోనే అంతర్జాతీయ గుర్తింపు'

అయిదేళ్లకు ముందు భారత్​ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమూనాగా ఉండేదని, మళ్లీ ఆ పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​. అంతర్గత విజయాలతోనే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. అందుకు ఆర్థికాభివృద్ధి, అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత రా చీఫ్​తో ఓలి భేటీపై విమర్శలు

నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలిపై అధికార, విపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓలి.. భారత నిఘా సంస్థ అధికారి సామంత్​ కుమార్​తో అపారదర్శకంగా భేటీ నిర్వహించిన నేపథ్యంలో.. దౌత్యపరమైన విషయాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఎస్కేకు ఈ ఏడాది కలిసిరాలేదు: ధోని

ముంబయితో పోరులో ఘోరంగా విఫలమయ్యామని సీఎస్కే కెప్టెన్​ ధోని అన్నాడు. ఈ ఓటమి తనకు బాధకలిగించిందని తెలిపాడు. ఈ ఏడాది తమ జట్టుకు కలిసి రాలేదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఆ కోరికను ఎప్పటికైనా తీర్చుకుంటా'

ప్రముఖ సినీనటుడు కమల్​హాసన్​ రెండో తనయ అక్షర హాసన్.. తండ్రి బాటలోనే సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెబుతోంది. దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Oct 24, 2020, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.