- సడలింపులతో ఉద్ధృతి
లాక్డౌన్ నిబంధనలు సడలింపులతో రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కుల ధరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 294 కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడిగాపులు
విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ నుంచి లీకైన స్టైరీన్ ఘాటుకు కకావికలమైన జీవితాలెన్నో. ప్రమాదం జరిగి 35 రోజులు గడుస్తు న్నప్పటికీ నేటికీ చాలామంది కోలుకోలేదు. వారికి ప్రభుత్వ పరిహారం పూర్తిగా అందలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒక్కరే రావాలి
కరోనా నివారణ చర్యల్లో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు ప్రాంగణంలోకి వాహనంలో ప్రవేశించే సమయంలో అందులో ఇతరులను అనుమతించబోరని.. సందర్శకులను సైతం తమ వెంట తీసుకురావొద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుంభకోణంలో ఉద్యోగుల పాత్రపై ఆరా
ఈఎస్‌ఐ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల్ని ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ (అనిశా) సిద్ధమవుతోంది. ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్ నుంచి వెళ్లిన దస్త్రాలు సచివాలంలో ఎలా ఆమోదించారనే అంశంపై దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అంతులేని వలస వేదన
కరోనా అన్నిరంగాలను సంక్షోభంలోకి నెట్టి అందరిని క్షోభ పెడుతోంది. అయితే ఎక్కువ ఇబ్బంది పడినవారు పొట్టకూటి కోసం వలస వెళ్లిన కార్మికులే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అత్యవసర వార్డులోకి వర్షపు నీరు!
మహారాష్ట్ర జల్గావ్ లోని డాక్టర్ ఉల్హాస్ పాటిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వర్షపునీటితో నిండిపోయింది. నీరు మోకాళ్ల లోతుకు చేరింది. ఆ సమయంలో ఎనిమిదిమంది రోగులు చికిత్స పొందుతుండగా వారిని వేరొక చోటుకు తరలించారు. వీడియో కోసం క్లిక్ చేయండి.
- వరుస వడ్డన
పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా తొమ్మిదో రోజూ పెంచాయి. తాజాగా సోమవారం లీటర్ పెట్రోల్‌పై 48 పైసలు, డీజిల్‌పై 59 పైసలు చొప్పున పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా విజృంభణ
కరోనా బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 4.35 లక్షల మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంతో కష్టపడ్డాడు
సుశాంత్‌కు ధోనీ పాత్రపై ఉన్న ఆసక్తి గురించి చెప్పిన నిర్మాత అరుణ్ పాండే.. 'ఎం.ఎస్.ధోని' బయోపిక్‌లోని హెలికాప్టర్ షాట్ కోసం అతడు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి ఆ పాత్రలో అనుష్క?
హీరోయిన్ అనుష్క.. మరోసారి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో నటించనుందని సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.