ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Mar 6, 2021, 8:59 AM IST

9 am top news
టాప్ టెన్ న్యూస్
  • నగర నగారా: విజయవాడలో అధికార పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరు..?

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో అత్యధిక మంది అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు శక్తివంచన లేకుండా తిరుగుతున్నా.. మేయర్ అభ్యర్థి విషయంలో స్పష్టత కరవైంది. ఎవరిని ప్రకటిస్తే ఎవరు నొచ్చుకుంటారోననే సందిగ్ధంలో అధికార పార్టీలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు

విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు ఎదురైంది. విజయసాయిరెడ్డి మైకు పట్టుకుని కార్మిక సంఘాల నేతలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుండగా.. సీఐటీయూ కార్యకర్త మాట్లాడారు. పోస్కోతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయించాలని ఆయన..‌ విజయసాయి రెడ్డితో అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముఖ్యమంత్రి జగన్​కు ఇక విదేశీ జైలే: నారా లోకేశ్

ముఖ్యమంత్రి జగన్​కు ఇక విదేశీ జైలే అంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దెవా చేశారు.‌ జగన్​కు ఇక విదేశీ జైలే అన్న ఓ జాతీయ మీడియా కథనాన్ని లోకేశ్‌ తన ట్విట్టర్​కు జతచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశాఖలోని హెచ్‌పీసీఎల్‌కు.. 2200 టన్నుల రియాక్టర్‌.. 768 చక్రాల ట్రాలర్‌!

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌కు చెందిన విశాఖ్‌ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టు కోసం ప్రపంచంలోనే అతి భారీ రియాక్టర్‌ త్వరలో చేరుకోనుంది. దీన్ని షిప్‌యార్డు తీరంలోని జెట్టీ నుంచి సింధియా కూడలి, ఐఓసీ టెర్మినల్‌ రోడ్డు మీదుగా ప్రాజెక్టులోకి తరలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టైమ్‌ మ్యాగజైన్‌పై 'మహిళా రైతులు'

నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతోన్న మహిళా రైతుల ఫొటోలను ప్రఖ్యాత టైమ్​ మ్యాగజైన్​ ప్రచురించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ సంచిక కవర్​ పేజీని ట్విట్టర్​లో విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 100వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

రైతు ఉద్యమం నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంటుంది. భవిష్యత్తులో మరింత పటిష్ఠంగా ఉద్యమం చేపడతామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ఆందోళనలకు 100 రోజులైన నేపథ్యంలో ఇవాళ బ్లాక్‌ డే పాటిస్తున్నారు. 5 గంటల పాటు దిల్లీలోని కుండ్లీ మనేసర్‌ పల్‌వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను దిగ్బంధిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 75వ స్వాతంత్ర్య వేడుకలకు 259 మందితో జాతీయ కమిటీ

75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో 259 మందితో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, నటులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణిలు పీవీ సింధు, మిథాలి రాజ్​కు చోటు కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చైనా దూకుడుకు నిదర్శనం'

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందన్నారు అమెరికా పెంటగాన్​ చీఫ్​గా బైడెన్ ఎంపిక చేసిన కొలిన్​ కహల్​. ఈ క్రమంలో తన మిత్రదేశాలకు అమెరికా అండగా నిలవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సన్నీ క్రికెట్​ అరంగేట్రానికి అర్ధ శతాబ్దం పూర్తి

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​కు మార్చి 6తో ప్రత్యేక అనుబంధం ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున తన క్రికెట్​ జీవితాన్ని ఆరంభించాడు సన్నీ. స్వర్ణోత్సవాల సందర్భంగా క్రీడా విశేషాల గురించి ఆయనేమన్నారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • ఈ జీవితం బోర్ కొట్టేసింది: సోనాక్షి సిన్హా

వరుసగా సినిమాలు చేయడం వల్ల తనకు తీరిక లేకుండా పోయిందని హీరోయిన్ సోనాక్షి సిన్హా అభిప్రాయపడింది. ఇకపై కాస్త నెమ్మదిగా చిత్రాలు చేయాలనుకుంటున్నానని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.