- ‘ఉద్దానం’లో కిడ్నీ వ్యాధిగ్రస్థులు పెరగటానికి కారణమిదే..
పర్యావరణ సమస్యల వల్లే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. ప్రభుత్వం ఎంపిక చేసిన జార్జి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వెల్లడించింది . మత్స్య సంపద , ధాన్యం , భూగర్భ జలాలు కలుషితమై.. అసాధారణ స్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులవుతున్నారని తెలిపింది . దేశ వ్యాప్తంగా 7నుంచి 8 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కృష్ణాతీరంలో దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
విజయవాడ కృష్ణాతీరంలోని పలు దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాలుష్య రహిత భోగి.. మురపాక గ్రామస్థుల వినూత్న ఆలోచన
అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆ గ్రామస్థులు భావించారు. సనాతన భారతీయ సంస్కృతిని.. వినూత్న పద్ధతిలో తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఇష్టంగా జరుపుకొనే భోగి సంబరాలను కాలుష్య రహితంగా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ''లక్ష ఒక్క" పిడకలను తయారు చేసి హిందూ ధర్మాన్ని, విశిష్టతను చాటి చెబుతున్నారు సిక్కోలు వాసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి
దేశాలు వేరు, భాషలు వేరు, పెరిగిన వాతావరణం వేరు... కానీ ఆంధ్రా అబ్బాయికి, ఆప్ఘనిస్తాన్ అమ్మాయికి ఇవి ఏవీ అడ్డుగోడలుగా నిలవలేదు. చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇరువురి పెద్దలకూ తెలియజేశారు. వారి అనుమతితో హిందూ సంప్రదాయం ప్రకారం విజయవాడలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతులతో నేడు 8వ విడత చర్చలు- కొలిక్కివచ్చేనా?
తులతో నేడు కేంద్రం 8వ విడత చర్చలు జరుగనుంది. అయితే సాగు చట్టాల రద్దు తప్ప రైతుల ఏ డిమాండునైనా పరిశీలిస్తాం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాయు కాలుష్యంతో భారత్‌లో గర్భస్రావాల ముప్పు ఎక్కువ
భారత్‌లో వాయుకాలుష్యానికి ఎక్కువగా గురయ్యే గర్భిణులకు గర్భస్రావాల ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనం దేశంతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోనూ వాయుకాలుష్య ప్రభావం వల్ల గర్భస్రావం, మృత శిశువుకు జన్మనివ్వటం వంటి ముప్పులు ఎక్కువని ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్'లో కథనం ప్రచురితమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వారిని ఉపఎన్నికల్లో పోటీచేయనీయొద్దు'
ఒక చట్ట సభకు ఎన్నికై, అనర్హత వేటు పడిన సభ్యులు..తిరిగి అదే సభకు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే అంశంపై కేంద్ర ప్రభుత్వ, ఎన్నికల కమిషన్ల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. 10వ షెడ్యూలు ప్రకారం అనర్హత వేటు పడపిన చట్టసభ్యులు.. ఖాళీ అయిన తమ స్థానానికి జరిగే ఉప ఎన్నిల్లో పోటీ చేయకుండా నిలువరించాలని దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- క్యాపిటల్‌లో 'హింస'ను ఖండించిన ట్రంప్
అందరు అమెరికన్లలాగే తాను కూడా క్యాపిటల్ భవనం వద్ద జరిగిన హింసతో ఆగ్రహానికి గురైనట్టు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా ఎప్పుడూ శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటుందన్నారు. మరోవైపు అధికార బదిలీకి సహకరిస్తానని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అవతరించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 2017 అక్టోబర్ నుంచి తొలి స్ధానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను ఎలాన్ అధిగమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాకర్ ర్యాలీలో ప్రమాదం... ఆసుపత్రిలో భారత రేసర్
డాకర్ ర్యాలీలో భారత్ తరఫున చరిత్ర సృష్టించిన రేసర్ సంతోష్.. అదే రేసులో ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే'
శర్వానంద్ హీరోగా బి. కిశోర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'శ్రీకారం'. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.