- 570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ
నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదానీ చేతికి గంగవరం పోర్టు?
ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోనుంది. వార్‌బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థ అధీనంలోని 31.5% వాటాను 19వందల 54 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకొంది. ఫలితంగా.. గంగవరం పోర్ట్ కంపెనీలో 16.3 కోట్ల షేర్లు అదానీ సంస్థ చేతికి రానున్నాయి. ఒక్కో షేరును 120 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇంటి ఆకృతిపై అభ్యంతరం చెప్పం.. '
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణంలో ఆకృతి నిబంధనను ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలంటే ప్రతిపాదిత నమూనాయే ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నిర్మించుకునేవారు తమ ఇష్ట ప్రకారమే కట్టుకునే వెసులుబాటు కల్పించింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నల్ల పసుపు, గోధుమ- ఒడిశా వాసి అరుదైన పంట
ఒడిశా రాష్ట్రానికి చెందిన దివ్యరాజ్ బెరిహా అరుదైన పంటలను సాగు చేస్తున్నారు. అంతరించిపోతున్న స్థితిలో ఉన్న నల్ల రకం గోధుమ, పసుపును పండించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా బొటానికల్ శాస్త్రవేత్త అయిన దివ్యరాజ్.. ఇటువంటి అరుదైన రకాలను కాపాడటమే తన లక్ష్యమని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశోధనలే ప్రజారోగ్యానికి కీలకం
కరోనా సంక్షోభంతో వైద్య పరికరాల అవసరం అందరికీ తెలిసొచ్చింది. దేశంలో వైద్య పరికరాలకు విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ.. దేశీయ ఉత్పత్తిరంగం తక్కువ విలువ కలిగిన ఉత్పత్తులకే పరిమితమైంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వైద్య రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లఘు పరిశ్రమలపై చిన్నచూపు
కరోనాకు ముందు అంతంతమాత్రంగా ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగంపై మహమ్మారి చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. కొవిడ్ అనంతరం ఈ రంగానికి ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్నది విశ్లేషకులు అభిప్రాయం. సరైన రుణ లభ్యత లేక ఈ రంగం మరింత కుదేలైందని.. ఫలితంగా దేశీయ లఘు సంస్థలు తీవ్ర ఒడుదొడుకులతో సతమతమవుతున్నాయని మూడీస్ సంస్థ నివేదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మూడు వారాలు లాక్డౌన్ పొడిగింపు- ఆంక్షలు సడలింపు
జర్మనీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని నిబంధనలకు సడలిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. పొలార్డ్ మెరుపులు
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్. దీంతో హర్షెల్ గిబ్స్, యువరాజ్ సింగ్ సరసన చేరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాని 'వి' సినిమాపై పరువు నష్టం కేసు
తన ఫొటోను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సాక్షి మాలిక్, 'వి' సినిమాపై కేసు పెట్టింది. తక్షణమే ఆమె ఫొటోలు ఉన్న సీన్లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.