ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - ఆంధ్రప్రదేశే వార్తలు

.

9 am top news
9AM ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 21, 2020, 8:51 AM IST

  • అప్పుల్లో, ఖర్చుల్లో ఏపీదే తొలిస్థానం.. కాగ్ లెక్కల్లో వెల్లడి

దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే... ఆంధ్రప్రదేశ్‌ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం.. అప్పుల రూపంలోనే సమీకరించినట్లు కాగ్ గణాంకాలు తేల్చాయి. ప్రతి వంద రూపాయల ఖర్చులో 51 రూపాయలు రుణాల ద్వారా తెచ్చుకున్నవేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు ఏపీ దరిదాపుల్లో కూడా లేవు. అటు బడ్జెట్‌ అంచనాల మేరకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నదీ మన రాష్ట్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

రాష్ట్రంలో దాదాపు వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నేడు ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు దశల్లో సమగ్ర భూ సర్వే చేపట్టి.. 2023 జనవరి నాటికి రాష్ట్రమంతటా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలి దశ నేటి నుంచి ప్రారంభం కాగా.... సర్వే పూర్తవగానే రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా వైరస్ స్ట్రెయిన్​పై అత్యవసర భేటీ!

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్​ స్ట్రెయిన్​పై భారత్​ అప్రమత్తమైంది. ఈ విషయమై చర్చించేందుకు కొవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని(జేఎండీ) అత్యవసర సమావేశానికి పిలిచింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడు ఆకాశంలో అద్భుతం..397 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు !

వినీలాకాశంలో మునుపెన్నడూ చూడని మహా కలయిక నేడు ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహాలైన గురు-శని అత్యంత సమీపంలోకి రానుండటంతో ఆ రెండూ కలిసినట్లుగా ఆకాశంలో ఏర్పడే అద్భుతం వీనుల విందు చేయనుంది. ఒకటి కాదు.. రెండు కాదు అక్షరాల 397 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరకు వచ్చినట్లు కనిపించనున్నాయి. అందుకే దీనిని ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రేట్ కంజంక్షన్ (మహా కలయిక)గా అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మారని సఫాయీ కర్మచారుల జీవనం- ఎవరిదీ నేరం?

పాకీ పని!... మనుషుల మలాన్ని ఎత్తివేసే పని చేసేందుకు సాటి మనుషులనే ఉపయోగించే ఈ అనాచారం దేశంలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. దీన్ని నిషేధిస్తూ చేసిన చట్టాన్నీ నిబద్ధంగా అమలు చేయలేని ప్రభుత్వాల చేతగానితనానికి, అమానుషం కళ్లకుకడుతున్నా చూసీచూడనట్లు వదిలేసే నీతిలేనితనానికి నిదర్శనం నేటికీ కొనసాగుతోంది! ఈ పరిస్థితులు మారేది ఎప్పుడు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'కేంద్ర ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించండి'

రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. చర్చలకు అనుకూల తేదీని నిర్ణయించాలని కోరింది. ఈ మేరకు నిరసన తెలుపుతున్న కర్షక సంఘాలకు లేఖ రాసింది కేంద్ర వ్యవసాయ శాఖ. చట్టాల సవరణపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'బెదిరింపులు ఆపండి'- అమెరికాకు చైనా హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు ఇదివరకెన్నడూ ఎరుగని విధంగా క్షీణించాయి. తాజాగా డ్రాగన్​ దేశానికి చెందిన మరో 59 కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్​లో చేర్చడంపై చైనా మండిపడింది. బెదిరింపు చర్యలు ఆపాలని...లేకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోహ్లీతో పాటే స్వదేశానికి షమీ!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయపడిన టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమీ.. సిరీస్​కు పూర్తిగా దూరంకానున్నట్లు తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో పాటు షమీ స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఒడిశా అమ్మాయికి లవ్​లెటర్స్​ రాశా'

టాలీవుడ్​ యంగ్​ హీరో సందీప్​ కిషన్​.. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీబిజీగా గడుపుతున్నారు​. ఆయన నటిస్తున్న 'ఏ1 ఎక్స్​ప్రెస్​', నిర్మించిన 'వివాహ భోజనంబు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను సందీప్​ కిషన్​ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.