ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ టాప్​న్యూస్

.

5 pm top news
5 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 21, 2020, 4:59 PM IST

  • విచారణ వాయిదా
    రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా పడింది. రాజధానిపై ఉన్నయథాతద స్థితిని అక్టోబర్‌ 5 వరకు పొడిగించింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • నిధులివ్వండి
    రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిథున్ రెడ్డి... దిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్​ను కలిశారు. పోలవరం పెండింగ్ నిధుల విడుదల, ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. నిధుల విడుదలకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టులతో రాయలసీమకు కలిగే లబ్ధిపై కేంద్రమంత్రికి వివరించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సీఎస్, డీజీపీలకు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు
    పీపీఈ కిట్లపై ప్రశ్నించినందుకు ఓ వైద్యుడిపై సీఐడీ కేసు నమోదు చేసిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్​హెచ్​ఆర్​సీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ ఏపీ సీఎస్​, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • దిల్లీకి అమరావతి మహిళా ఐకాస సభ్యులు
    అమరావతి మహిళా ఐకాస సభ్యులు దిల్లీ వెళ్లారు. వివిధ జాతీయ పార్టీల ఎంపీలను వీరు కలవనున్నట్లు తెలిపారు. అమరావతి ఆక్రందన దేశమంతా తెలియచేసేందుకే దిల్లీ పర్యటన చేపట్టామని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అంతర్జాతీయ స్థాయిలో యోగిపై కఫీల్​ ఖాన్​ పోరాటం!
    ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​పై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు గోరఖ్​పుర్​కు చెందిన డాక్టర్​ కఫీల్​ ఖాన్​. రాష్ట్రంలో, దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతోందని, జాతీయ భద్రత చట్టం, తీవ్రవాద నిరోధక చట్టాల వంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'
    దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 812 పాయింట్లు డౌన్
    దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 812 పాయింట్లు కోల్పోయి.. 38 వేల మార్క్ ఎగువన స్థిరపడింది. 254 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 11,251 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రకృతి మెచ్చే 'కలంఖుష్' కాగితం
    ఒక్క చెట్టును నరికే పని లేకుండా.. నీటిని వృథా చేయకుండా తయారవుతోంది ఆ కాగితం. పర్యావరణహిత కాగితంపై అక్షరాలు రాయడానికి కలం సంబరపడిపోతుందట. అందుకే ఆ కాగితానికి 'కలంఖుష్' అని పేరుపెట్టారు. మరి గుజరాత్​లో తయారవుతున్న ఆ ప్రకృతి పేపర్ విశేషాలేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
  • సన్​రైజర్స్​కు 'వెంకీమామ' ఆల్​ ది బెస్ట్
    హైదరాబాద్​ జట్టు తన తొలి మ్యాచ్​ ఆడనున్న నేపథ్యంలో వారికి ఆల్​ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్. మిమ్మల్ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటానని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రభాస్ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు 'సింగీతం'
    ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మెంటార్​గా ఉండనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.