ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ap taza

.

5pm top news
5 Pm ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 27, 2020, 4:59 PM IST

  • హైకోర్టుపై కరోనా ప్రభావం
    కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న క్రమంలో ఈనెల 30 వరకు హైకోర్టు కార్యకలాపాలు రద్దయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రార్​ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • జగన్ సంతకాలకు ఛార్జ్​షీట్లు వస్తున్నాయ్!
    వైయస్ జగన్ ఎలాంటి వ్యక్తి అనే విషయం ఆయన తండ్రి రాజశేఖర్​రెడ్డికి తెలుసని.. అందుకే రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జగన్​ని బెంగళూరు ప్యాలెస్​కే పరిమితం చేశారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. చరిత్ర ఎంత దాచినా నిజం దాగదని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆగస్టు 3 నుంచి పాఠశాలలు..!
    ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్​ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. జులై నెలాఖరు నాటికి నాడు-నేడు మొదటి విడత పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని సీఎం జగన్​ చెప్పారని మంత్రి అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనాపై ఘన విజయం
    సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తప్పకుండా ఎదుర్కోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా... ఆసుపత్రి మెట్లెక్కాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, కర్ణాటకలోని బెంగళూరులో ఓ వందేళ్ల బామ్మ కరోనా మహమ్మారితో పోరాడి విజయం సాధించింది. కేవలం తొమ్మిది రోజులు చికిత్స పొంది వైరస్​ను తరిమికొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 108 అడుగుల కెంపెగౌడ విగ్రహ నిర్మాణ పనులు షురూ
    108 అడుగుల ఎత్తైన కెంపెగౌడ విగ్రహ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత అంకురాల్లో పెరిగిన చైనా పెట్టుబడులు
    భారత అంకుర సంస్థలపై చైనా కంపెనీల పెట్టుబడులు ఇటీవల భారీగా పెరిగాయి. 2016తో పోలిస్తే 2019 నాటికి భారతీయ అంకురాల్లో చైనా పెట్టుబడులు ఏకంగా 12 రెట్లు పెరిగినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కర్తార్​పుర్ కారిడార్ పునఃప్రారంభానికి పాకిస్థాన్ రెడీ
    కరోనా కారణంగా మూతపడిన కర్తార్​పుర్​ కారిడార్​ను పునఃప్రారంభించడానికి పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం నుంచి రహదారిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. దీనికోసం అవసరమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు భారత్​ను ఆహ్వానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ద్రవిడ్​కు జీవితాంతం రుణపడి ఉంటా
    తన జీవితంపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ ప్రభావం చాలా ఉందని తెలిపాడు టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా. క్రికెట్లో ఓ దశకు చేరుకున్నాక అందులో​నుంచి వైదొలగడమనేది ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా తెలియజేశాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'అర్జున్‌రెడ్డి' దర్శకుడి కోసం రణ్‌బీర్‌ ఎదురుచూపులు
    'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్​లో రీమేక్ చేసి ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఈ సినిమా తర్వాత రణ్​బీర్​ కపూర్​తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడట సందీప్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.