- రాష్ట్రంపై కరోనా పంజా
గడిచిన 24 గంటల్లో 9 వేల 9 వందల 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 82 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ' 48 గంటల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోయారో!'
సామాజిక మాధ్యమాల్లో తనపై వ్యక్తిగతంగా దూషించిన గుర్రంపాటి దేవేంద్రరెడ్డిపై తక్షమమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!
రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలో పరిశ్రమల సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా-బంగాల్ తీరం వైపుగా కదిలే సూచన ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోడ్డుపై యాసిడ్ ట్యాంకర్ లీక్.. అంతా భయం గుప్పిట్లో!
మధ్యప్రదేశ్ రత్లాంలో ఓ యాసిడ్ ట్యాంకర్ లీకేజీకి గురైంది. ప్రధాన రహదారి మొత్తం తెల్లటి పొగ కమ్మేయటం వల్ల పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్
పార్టీలో నెలకొన్న అపార్థాలను విడనాడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. సచిన్ పైలట్ వర్గం సొంత గూటికి చేరిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వన్‌టైం రుణ పునర్నిర్మాణం అమలు సాధ్యమేనా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ఎస్ఎంఈ ఖాతాల వన్‌టైం పునర్నిర్మాణ ప్రక్రియ అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో సంస్థల యజమానులు భవిష్యత్తు అంచనాలు వేయలేరని చెబుతున్నారు. అసలేమిటీ వన్‌టైం రుణ పునర్నిర్మాణ ప్రక్రియ? మారటోరియం కన్నా ఎంతమేరకు అనువుగా ఉంటుంది? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- సగం ఆసుపత్రులు పనికిరాకుండా పోయాయి!
లెబనాన్ దేశానికి భారీ పేలుడు తీరని నష్టం కలిగించింది. పేలుడు జరిగిన బీరుట్ ప్రాంతంలో సగానికి పైగా ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. ఆ ఘటనలో గాయపడినవారికి సైతం వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అజహర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు: వకార్ యూనిస్
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభమైంది. అయితే ఫామ్ లేమితో సమస్యలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ అజహర్ అలీకి మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్. కచ్చితంగా మిగతా రెండు టెస్టుల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్ జట్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెగా డైరెక్టర్‌తో బ్యాచిలర్ బాబు నెక్ట్స్ సినిమా?
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తన తర్వాతి చిత్రం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ కథకు కూడా ఓకే చెప్పేశాడట. ఇక సినిమా పట్టాలెక్కడమే ఉంది. ప్రస్తుతం కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.