ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - andhrapradesh news

.

3 pm top news
3 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 16, 2020, 2:59 PM IST

  • వారిని తప్పించండి
    దేవాలయాల మీద దాడులు.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రథానికి సంబంధించిన సింహపు ప్రతిమల మాయం ఘటనలపై.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి.. దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • మంత్రిని బర్తరఫ్ చేయాలి
    ఇంద్రకీలాద్రిపై వెండి సింహాల ప్రతిమల మాయమైన ఘటనలో మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కోడెల వర్థంతిని అడ్డుకోవడం దుర్మార్గం
    వైకాపా ప్రభుత్వం తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సభాపతి కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఇవాళ కోడెల ప్రథమ వర్థంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థులు
    సర్కారీ పాఠశాలలకు కొత్త కళ వస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. వీరిలో కనీసం 10 శాతం మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న వారే కావడం విశేషం. గ్రామాల్లో సరైన పాఠశాలలు లేక, మండలస్థాయిలో ఉన్నవి ఎప్పుడు తెరుస్తారో అవగాహన లేకపోవడం వల్ల ఈ సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆ పెండింగ్​ కేసులపై సుప్రీంకు అమికస్‌ క్యూరీ నివేదిక
    ప్రజాప్రతినిధులపై పెండింగ్​లో ఉన్న కేసుల వ్యవహారంలో తాజాగా మరో సప్లిమెంటరీ నివేదికను సుప్రీంకు అందించారు అమికస్​ క్యూరీ అన్సారీ. కేసుల సత్వర విచారణకు పలు సూచనలు ఇందులో పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ సత్వరమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. నిర్దేశిత గడువులోగా ఆయా కేసులన్నీ కొలిక్కిరావాలన్నదే తమ అభిమతమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • చైనా సరిహద్దుల్లో 200 రౌండ్ల కాల్పులు..?
    కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకొనే క్రమంలో భారత్-చైనా వర్గాలు పరస్పర హెచ్చరికలు జారీ చేసుకొనే సమయంలో 100-200 రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం'
    ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాణిజ్య వర్గాలు కూడా కరోనా సంక్షోభంతో వచ్చిన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఫిక్కీ వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విషయాలు వెల్లడించారు దాస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఒరాకిల్ సొంతం కానున్న టిక్‌టాక్‌ కార్యకలాపాలు!
    చైనాకు చెందిన షార్ట్​ వీడియో యాప్​ టిక్​టాక్​ అమెరికా కార్యకలాపాలను ప్రముఖ అమెరికా సంస్థ ఒరాకిల్​ సొంతం కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒరాకిల్​ ఒప్పందానికి దగ్గరగా ఉన్నట్లు విన్నానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పడమే కారణం. ఈ ఒప్పందం కొలిక్కి వస్తే, బైట్‌డ్యాన్స్‌లో ఒరాకిల్‌ సాంకేతిక భాగస్వామిగా ఉంటూ టిక్‌టాక్‌ సమాచారాన్ని నిర్వహిస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రైనా బంధువులపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు
    క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల కుటుంబంపై గతనెలలో జరిగిన దాడి కేసులో అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారని ముఖమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నట్లు డీజీ దినకర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ప్రసిద్ధ గాయని ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి జీవిత విశేషాలు
    ప్రసిద్ధ గాయని ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి జయంతి నేడు(సెప్టెంబరు 16). భారతరత్న, రామన్​ మెగసెసె అందుకున్న తొలి సంగీత కళాకారిణి ఈమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుని, జీవిత విశేషాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.