ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - telugu updates

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : May 5, 2021, 12:49 PM IST

Updated : May 5, 2021, 1:05 PM IST

  • ధూళిపాళ్లకు సిటీ స్కాన్‌, వైద్య పరీక్షలు చేయించండి: హైకోర్టు

ధూళిపాళ్ల దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ధూళిపాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ధూళిపాళ్లకు సీటీ స్కాన్‌ తదితర పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుమల భక్తుల సంగతేమిటో..!

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మే నెలకు సంబంధించి తితిదే రోజుకు 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను జారీచేసింది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారుగా 10వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో తితిదే జారీచేసిన దర్శన టికెట్ల కన్నా తక్కువగానే భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూను విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అంత్యక్రియలకు భారం

కరోనా సృష్టించిన కల్లోలంలో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వైరస్​తో మృతి చెందిన వారి అంత్యక్రియలు జరిపేందుకు ఎదురుచూడాల్సి వస్తోంది. శ్మశానాల వద్ద కరోనా మృతదేహాలు వరుసలు కడుతుండటంతో... దహనం చేసేందుకు ఎండు కట్టెలు లేక.. పచ్చి వాటినే వినియోగిస్తున్నారు. ఆప్తులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న బాధితుల కుటుంబాల నుంచి.. ఇదే అదనుగా కొందరు డబ్బులు దండుకుంటున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి శ్మశానానికి తీసుకువెళ్లటానికి ఒక ప్యాకేజీ.. దహన సంస్కరణలకు మరో ప్యాకేజీ అంటూ బాధిత కుటుంబం నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కదులుతున్న రైల్లో నుంచి దూకిన మహిళ...రక్షించిన కానిస్టేబుల్

కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన మహిళను.. ఓ రైల్వే కానిస్టేబుల్ ప్రాణాపాయం నుంచి కాపాడారు. ముందు ఓ యువతి రైలు నుంచి ప్లాట్‌ఫాం మీదకు దిగగా ఆ వెనుకే ఉన్న మరో మహిళ కదులుతున్న రైలు నుంచి దూకేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ సతీష్...దూరం నుంచే మహిళలను వారించారు. అయినా ఆ మహిళ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కేంద్రం కొత్తగా పది శాతం రిజర్వేషన్లను.. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చిందన్న సుప్రీం ధర్మాసనం 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయంపై పునఃపరిశీలన అవసరం లేదని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగాల్​ ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణస్వీకారం

బంగాల్ సీఎంగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. అతి తక్కువ మంది దీదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సమాచార మాధ్యమాన్ని ప్రారంభించిన ట్రంప్

'ఫ్రమ్​ ది డెస్క్​ ఆఫ్​ డొనాల్డ్​ జే ట్రంప్'​ పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్​ ప్లాట్​ఫార్మ్​ను ప్రారంభించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ప్లాట్​ఫార్మ్​ సామాజిక మాధ్యమం కాదని ఆయన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మాధ్యమంలో ట్రంప్​ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన చేసిన ప్రకటనలను పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైద్య రంగానికి రూ.50 వేల కోట్ల నిధులు:ఆర్​బీఐ

కొవిడ్-19 రెండో దశ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేసేందుకు వ్యాపారులు అలావాటు పడ్డారని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి బటపడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా హెల్త్​కేర్​, చిన్న రుణ సంస్థలకు భారీగా నిధులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ రేసులో బాబర్​, హేలీ

ఏప్రిల్​ నెలకు గానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' అవార్డు నామినేషన్లను బుధవారం ప్రకటించింది ఐసీసీ. పాకిస్థాన్ కెప్టెన్​ బాబర్​ అజామ్​, ఆసీస్ ప్లేయర్​ హేలీని ఈ అవార్డుల రేసులో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విజయ్​ దేవరకొండతో గొడవ.. విశ్వక్​సేన్​ క్లారిటీ

టాలీవుడ్​లో ఎలాంటి సపోర్ట్​ లేకుండా హీరోలుగా ఎదిగిన యువ కథానాయకులు విజయ్​ దేవరకొండ, విశ్వక్​సేన్​. అయితే విజయ్​ దేవరకొండ, విశ్వక్​సేన్​ మధ్య వివాదాలకు గల కారణమేంటని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో స్పష్టత వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : May 5, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.