తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా సాగిన ఈఎస్‌ఎల్ క్రికెట్ పోటీలు శనివారంతో ముగిశాయి. గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించి, వారిలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈనాడు- స్ప్రైట్ ఆధ్వర్యంలో జిల్లా/ప్రాంతీయ/ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచినవారికి శనివారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రికెట్ జూనియర్స్, సీనియర్స్ విభాగాలతో పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడా పోటీల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈఎస్‌ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్, 'ఈనాడు' ఎండీ సీహెచ్.కిరణ్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.
ఈఎస్‌ఎల్ క్రీడా పోటీల్లో విజేతలు వీళ్లే..
క్రికెట్ (పురుషులు) సీనియర్ విభాగం:
విజేత జట్టు: శ్రీ హరి డిగ్రీ పీజీ కళాశాల - కడప( రాయలసీమ రాకర్స్)
రన్నర్స్ జట్టు : సర్ధార్ పటేల్ కళాశాల జట్టు, హైదరాబాద్
క్రికెట్ జూనియర్స్ (పురుషులు) విభాగం
విజేత: శ్రీలక్ష్మి గణపతి ఎయిడెడ్ జూనియర్ కళాశాల (నార్త్ ఆంధ్ర)
రన్నర్స్: భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కళాశాల, హైదరాబాద్
మహిళల క్రికెట్ విభాగంలో..
విజేత: అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు
రన్నర్స్: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, హైదరాబాద్ జట్టు
వాలీబాల్ (పురుషులు)
విజేత: ప్రభుత్వ జూనియర్ కళాశాల -విశాఖ
రన్నర్స్: ఎస్‌బీఎస్ ప్రభుత్వ కళాశాల (ఖమ్మం)
వాలీబాల్ (మహిళలు)
విజేత: శ్రీ బాసర జూనియర్ కళాశాల (హైదరాబాద్)
రన్నర్స్: సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల (హైదరాబాద్)
కబడ్డీ (పురుషులు)
విజేత: శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, హన్మకొండ
రన్నర్స్: బీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల (చిత్తూరు)
అథ్లెటిక్స్ - 100 మీటర్లు (మహిళలు)
విజేత: పి.మౌనిక, వీఆర్ జూనియర్ కళాశాల, నెల్లూరు
రన్నర్స్: ఎ. అక్షిత- శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, ఖమ్మం; ఎస్. జహ్నవి కీర్తి- శ్రీ సాయి శక్తి జూనియర్ కళాశాల (విశాఖ)
200 మీటర్లు (మహిళలు)
విజేత:ఎ. మైథలి- శ్రీ సీవీ రామన్ జూనియర్ కళాశాల, ఖమ్మం,
రన్నర్స్: పి. మౌనిక, వీఆర్ కళాశాల, నెల్లూరు; ఎస్. జాహ్నవి కీర్తి - శ్రీ సాయి శక్తి జూనియర్ కళాశాల - విశాఖ
100 మీటర్ల విభాగం (పురుషులు)
విజేత: జె.చందు (ట్రిపుల్ ఐటీ) - కడప
రన్నర్స్: దినేశ్ కార్తిక్, రిసోనెన్స్ జూనియర్ కళాశాల, ఖమ్మం; జహీర్ మొహియుద్దీన్, ఎస్వీ జూనియర్ కళాశాల, తిరుపతి
200 మీటర్ల విభాగం (పురుషులు)
విజేత: జె. చందు ట్రిపుల్ ఐటీ - కడప
రన్నర్స్: ఎ. రోషన్ - శ్రీ సీవీ రామన్ జూనియర్ కళాశాల - ఖమ్మం; ఎన్. పెరోజలి- బీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల- తిరుపతి
బ్యాడ్మింటన్- మహిళలు (సింగిల్స్)
విజేత: తనుశ్రీ, ఓరుగల్లు జూనియర్ కళాశాల
రన్నర్స్: రెహానా జబీన్ - తపశ్య జూనియర్ కళాశాల- హైదరాబాద్
బ్యాడ్మింటన్ డబుల్స్ (మహిళలు)
విజేత: బి. నాగ అమ్మాజీ, వి. రమ్య- వీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కళాశాల - మచిలీపట్నం
బ్యాడ్మింటన్ సింగిల్స్ (పురుషులు)
విజేత:కె. ప్రశాంత్- శ్రీచైతన్య జూనియర్ కళాశాల - ఖమ్మం
రన్నర్స్: వర్షిత్ రెడ్డి ఆకాశదీప్ జూనియర్ కళాశాల - హైదరాబాద్
బ్యాడ్మింటన్ డబుల్స్ (పురుషులు)
విజేత: జి. సహృదయ్, ఎన్. అనిరుధ్ - శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, వరంగల్
రన్నర్స్: వై. వెంకట్, టి. విగ్నేశ్, భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కళాశాల- హైదరాబాద్
ఖోఖో (మహిళలు)
విజేత: వీఆర్ కళాశాల జట్టు, నెల్లూరు
రన్నర్స్: టీఎస్ మోడల్ పాఠశాల అండ్ జూనియర్ కళాశాల, జగిత్యాల
ఖోఖో (పురుషులు)
విజేత: ప్రభుత్వ జూనియర్ కళాశాల, నిజామాబాద్
రన్నర్స్: బీఎస్‌ఎన్ జూనియర్ కళాశాల, గుడివాడ
చదరంగం (మహిళలు)
విజేత:బి. అలేఖ్య, కైట్స్ జూనియర్ కళాశాల, విశాఖ
రన్నర్స్: కేఎల్‌వీ భానుశ్రీ, శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల, చిత్తూరు
చదరంగం (పురుషులు)
విజేత: జె. అక్షిత్ కుమార్, సిద్ధార్థ జూనియర్ కళాశాల, విజయవాడ
రన్నర్స్: ఎ. ఆసిష్ రెడ్డి, కేశవ స్మారక్ జూనియర్ కళాశాల, హైదరాబాద్
ఇదీ చదవండి : 'తప్పుడు ప్రచారం చేస్తే... పరువు నష్టం దావా వేస్తాం'