ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు... సోమవారం లేదా మంగళవారం ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరుగనుంది.
ఆ తదుపరి ఏడాది నుంచి 8,9 తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. దశలవారీగా పదో తరగతి వరకూ ఆంగ్ల మాద్యమంలోనే బోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆంగ్లమాధ్యమంలో బోధనపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రూపొందించిన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి : వెదురుతో వెరైటీ కోకలు... అరటితో అందమైన చీరలు..!