- విశాఖ జిల్లాలో...
కార్తికమాసం ముగింపు సందర్భంగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శివాలయం వద్ద పోలి పాఢ్యమి వేడుకలను నిర్వహించారు. మహిళలు వెలిగించిన దీపాలతో చెరువు దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆలయంలో పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.
- పశ్చిమగోదావరి జిల్లాలో...
మార్గశిర మాసం మొదటిరోజు పాఢ్యమి వేళ పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ప్రీతికరమైన మంగళవారం రోజు మార్గశిర మాసం పాఢ్యమి పర్వదినం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కార్తిక మాసం ముగింపు సందర్భంగా తణుకు పరిసర ప్రాంతాల్లో కాలువలు, నదీతీరాలు సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలోని అఘోర లింగేశ్వర స్వామి భస్మ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వీరభద్ర స్వామికి రుద్రాభిషేకాలు నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరశైవులు గుగ్గిళ్ళ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. బెంగళూరు ప్రాంతాల నుంచి వందలాది మంది వీరశైవులు ఆలయానికి వచ్చి దీపోత్సవ పూజల పాల్గొన్నారు. దీపాలను గర్భాలయంలో వెలిగించి కన్నడ వాయిద్యాల మధ్య నృత్య ప్రదర్శన చేస్తూ.. వీరభద్రస్వామి వేషధారులు భక్తులను అలరించాయి.
- తూర్పుగోదావరి జిల్లాలో...
కార్తిక మాసం చివరిరోజు కావటంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వేకువజామునే మహిళలు పోలాంబను స్వర్గానికి సాగనంపుతూ దీపాలు విడిచిపెట్టారు.
- కృష్ణాజిల్లాలో....
కార్తికమాసం ముగింపు సదర్భంగా తోట్లవల్లూరులో మహిళలు పూజలు చేశారు. అరటి డొప్పలలో దీపాలను వెలిగించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను కృష్ణనది పాయలో వదిలారు.
- ప్రకాశం జిల్లా...
కార్తిక మాసం ముగింపు పాఢ్యమి పూజలతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు శివాలయాల్లో దీపారాధనతో కార్తిక మాస పుణ్యఫలాన్ని అందుకున్నారు. మహిళలు కార్తిక దీపోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: