మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సెలవుల అమలుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్ జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని సీఎస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు వేతనం రిఫండ్ క్లాజును రద్దు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని వివరించారు. జాబ్ చార్టు అమలుపై సర్కారు నియమించిన కమిటీ ఇంకా అధ్యయనం చేస్తోందని సీఎస్ తెలిపారని చెప్పారు. త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై చీఫ్ సెక్రటరీ కీలక సమీక్ష