వైఎస్‌ఆర్ గృహ వసతి పథకంలో భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.100 కోట్లు పరిపాలన ఛార్జీల కింద మినహాయించి మిగతా రూ.1,000 కోట్లను జిల్లాల వారీగా కేటాయించింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాకు రూ.275 కోట్లు, కృష్ణాకు రూ.170 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.135 కోట్లు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే విధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమానికి (వైఎస్‌ఆర్ హౌసింగ్ ప్రోగ్రాం) రూ.46.07 కోట్లు కేటాయిస్తూ ఆర్థికశాఖ మరో జీవో విడుదల చేసింది.
ఇదీ చదవండి: