Electric Bike Explosion : ఛార్జింగ్‌కు పెట్టిన విద్యుత్తు ద్విచక్ర వాహనంలోని బ్యాటరీ పేలిపోయిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. రామచంద్రాపూర్‌కు చెందిన ఎగుర్ల ఓదేలు తన ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు. అర్ధరాత్రి బ్యాటరీ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నిద్రిస్తున్న వారంతా అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.
పదకొండు నెలల కిందట కొనుగోలు చేసిన బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నిత్యం ఉపయోగిస్తున్నామని, మరో నెల పాటు వారంటీ ఉందని బాధితుడు తెలిపారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం బాధితునికి కొత్త వాహనాన్ని అందజేసింది.
- ఇవీ చదవండి : బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.. రీపోస్టుమార్టం తర్వాత వాస్తవాలు వెల్లడి
- బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడు శుభస్వీకరణ కార్యక్రమం
- రాష్ట్రం రూ.61వేలకోట్ల అప్పు అడిగితే.. కేంద్రం మాత్రం..