ETV Bharat / city

అచ్చంగా.. ఆకుపచ్చంగా.. కోడిగుడ్లు! - hyderabad news

మీ అందరికీ కోడిగుడ్లు అంటే భలే ఇష్టం కదూ! ఈ కరోనా కాలంలో వీటి వినియోగమూ పెరిగింది కదా! మనలో కొందరు తిననని మారాం చేసేవాళ్లూ ఉంటారనుకోండి. అది వేరే సంగతి. ఇంతకీ విషయం ఏంటంటే..

kerala
కేరళలో కోడిగుడ్లు
author img

By

Published : May 24, 2021, 6:38 PM IST

మామూలుగా కోడి గుడ్డులో తెల్లసొన, పసుపు పచ్చసొన ఉంటాయి కదా.. కానీ మీకో విషయం తెలుసా.. ఆకుపచ్చసొనతో కూడా ఉంటాయండీ బాబూ! ‘ఆ.. తెలుసులే.. అవి కుళ్లిపోయిన గుడ్లై ఉంటాయి లే’ అని తేలిగ్గా తీసిపారేస్తారేమో మీరు. కానే కాదు.. అవి చక్కని తాజా.. నాటుకోడి గుడ్లు. ‘సర్లే ఏవో విదేశాల్లో అయి ఉంటుందిలే.. ఇప్పుడు ఏంటట?’ అని మళ్లీ అంతే తేలిగ్గా అనేస్తారేమో.. అస్సలు కాదు. ఈ ఆకుపచ్చసొనతో ఉన్న కోడిగుడ్లను కేరళలోని ఒతుక్కుంగల్‌లో ఉన్న ఓ ఫాంలోని ఆరు కోళ్లు మాత్రమే పెడుతున్నాయి.

ముందు భయపడ్డారు
కేరళలోని ఒతుక్కుంగల్‌కు చెందిన షిహాబుద్దీన్‌ అనే అతనికి చిన్న పౌల్ట్రీఫాం ఉంది. అందులో ఆయన నాటు కోళ్లను పెంచుతుంటారు. ఓ ఆరు కోళ్లు పెట్టిన గుడ్లలో లోపలి సొన మాత్రం ఆకుపచ్చగా ఉంటోంది. మొదటగా షిహాబుద్దీన్‌, ఈయన కుటుంబం వాళ్లు ఆ గుడ్లు పాడైపోయాయనుకున్నారు. వాటిని తింటే ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని భయపడ్డారు. కానీ తర్వాత వాటిని పొదిగిస్తే చక్కగా.. ఆరోగ్యవంతమైన కోడిపిల్లలు బయటకు వచ్చాయి. అప్పుడు ధైర్యం వచ్చి ఆ కోడిగుడ్లను వాళ్లు తిన్నారు. రుచి బాగానే ఉంది.

సోషల్‌ మీడియాలో పెట్టగానే...
ఈ విచిత్రమైన కోడిగుడ్ల చిత్రాలు, వీడియోలను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తక్కువ సమయంలోనే ఇది వైరల్‌గా మారింది. ఆ నోటా.. ఈ నోటా.. ఈ విషయం ‘కేరళ వెటర్నరీ, ఎనిమల్‌ సైన్సెన్‌ యూనివర్సిటీ’ బరీజుతిళీగ్శీ వారి చెవిన పడింది. వారు వీటి మీద కొన్ని పరిశోధనలు చేశారు. చివరికి కోళ్లు తీసుకునే ఆహారం వల్ల ఇలా జరిగి ఉంటుందని తేల్చారు. షిహాబుద్దీన్‌ కూడా ఇది నిజమై ఉండొచ్చు అని చెబుతున్నారు. తాను కోళ్లకు ప్రత్యేకంగా ఏమీ పెట్టలేదని.. తన పెరట్లో పెరిగే మూలికల మొక్కల ఆకులను వాటి దాణాలో కలిపి ఇచ్చానని చెబుతున్నారు. కొన్ని రోజులు వాటికి మామూలు ఆహారం అందిస్తే తిరిగి అవి పసుపు పచ్చసొన ఉన్న గుడ్లనే పెట్టాయంట. అన్నట్లు ఈ కోళ్లను అమ్మమని చాలా మంది షిహాబుద్దీన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే ఏకంగా కోడికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారట. కానీ ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు. మొత్తానికి ఇవండీ ఆకుపచ్చ కోడిగుడ్ల గురించి ఆసక్తికర విషయాలు.

ఇదీ చదవండి:

30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.