ETV Bharat / city

కరోనాతో పెరిగిన గుడ్డు వినియోగం - ఏపీలో గుడ్ల వినియోగం వార్తలు

కోడి గుడ్డు ధర పెరిగింది. ఒక్కోటి చిల్లర ధర రూ.6 చొప్పున పలుకుతోంది. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవడం, కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి తొలినాళ్లలో అపోహల వల్ల మాంసం, గుడ్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లను కొనేవారు లేక, వాటిని పోషించలేక చేతులెత్తేశారు. గుడ్లనూ నష్టాలకు విక్రయించారు.

egg
egg
author img

By

Published : Sep 21, 2020, 6:52 AM IST

లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రవాణా నిలిచిపోయి సకాలంలో దాణా అందలేదు. లక్షల్లో కోళ్లు చనిపోయాయి. రవాణా లేక కొత్తగా పిల్లలు వేసే అవకాశమూ లేకుండా పోయింది. ఏటా సగటున 2,170 కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉంది. అయినా కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా చాలా కోళ్లఫారాల్లో ఉత్పత్తిని 40 నుంచి 50 శాతానికే పరిమితం చేశారు. 15 నెలలుగా నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ రంగం ఇప్పుడే కోలుకోలేదని నెక్‌ గోదావరి జోన్‌ ఛైర్మన్‌ గంగాధర్‌ తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవాళ్లమని, ప్రస్తుతం స్థానికంగానే వినియోగం పెరిగిందని వివరించారు.

కారణాలివి!

  • లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంటు,్ల బేకరీలు, మిఠాయిల దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్డు పక్క బళ్లపైనా అమ్మకాలు మొదలయ్యాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే వారిపై పరిమితి సడలించారు. ఇక్కడ కోడిగుడ్డు వినియోగం పెరిగింది.
  • ఆహారంలో నిత్యం గుడ్డు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న నిపుణుల సూచనతో కరోనా నివారణకు ఇదో ఔషధంగానూ భావిస్తున్నారు. ఇళ్లలో వినియోగం అధికమైంది.
  • జాతీయ కోళ్ల సమన్వయ కమిటీ (ఎన్‌ఈసీసీ) సమాచారం ప్రకారం ఆదివారం విజయవాడలో రూ.5.04, విశాఖపట్నంలో రూ.5.07, చిత్తూరులో రూ.5.05, తూర్పు గోదావరిలో రూ.5.04 చొప్పున ధర పలికింది. అహ్మదాబాద్‌లో రూ.5.33, పుణేలో రూ.5.58, కోల్‌కతాలో రూ.5.53, సూరత్‌లో రూ.5.43 చొప్పున ఉన్నాయి. వెరసి చిల్లర ధర రూ.6 వరకు కొనసాగుతోంది.

ఇదీ చదవండి : అల్​ఖైదా తీవ్రవాది ఇంట్లో అనుమానాస్పద గది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.