ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఈ పనుల్ని పర్యవేక్షించాల్సిందిగా మంత్రి సూచించారు. సచివాలయం నుంచి పాఠశాలల్లో నాడు నేడు పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సామగ్రి సరఫరా చేయలేని కంపెనీల ఒప్పందాలను పరిశీలించి నోటీసులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దశల వారీగా చేపట్టిన ఈ పనులను నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి