ETV Bharat / city

తెలంగాణలో విద్యా సంస్థల పునఃప్రారంభంపై నేడు కీలక సమావేశం - విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తాజా వార్తలు

తెలంగాణలో విద్యా సంస్థల పునఃప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు.

ts minister
తెలంగాణలో విద్యా సంస్థల పునప్రారంభం
author img

By

Published : Jun 23, 2021, 9:29 AM IST

కరోనా ఉద్ధృతి తగ్గటంతో తెలంగాణలో విద్యా సంస్థల పునఃప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. జులై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించినందున.. విద్యా సంస్థల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, ఫీజులు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. పాఠశాలలను దశల వారీగా ప్రారంభించాలని విద్యా శాఖ భావిస్తోంది.

ఆన్​లైన్, ఆఫ్ లైన్ రెండూ సమాంతరం నిర్వహించడం కష్టమనే చర్చ జరుగుతోంది. కాబట్టి ఆన్​లైన్ కాకుండా కేవలం ప్రత్యక్ష బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది. మరోవైపు ఫీజుల విషయంలో జీవో 46ను కొనసాగించాలని విద్యా శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేవలం బోధన రుసుములను నెలవారీగా తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను కోరనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు.

విద్యా వాలంటీర్లు, సమగ్ర శిక్ష అభియాన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్​ , వ్యాయామ ఉపాధ్యాయులను ఇప్పట్లో తీసుకోవాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదిస్తోంది. కాని ఇప్పటికే సుమారు ఏడాదికి పైగా వేతనాలు లేక తమ కుటుంబాలు వీధినపడ్డాయని విద్యా వాలంటీర్లు, పార్ట్ టైం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నారు. వీటన్నింటిపై నేటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్​'- థర్డ్​ వేవ్​లో ఇదే ప్రమాదమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.