ETV Bharat / city

జీవో 2430తో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం: ఎడిటర్స్ గిల్డ్ - ఎడిటర్ గిల్డ్ న్యూస్

నిరాధార వార్తలు రాస్తే ప్రచార, ప్రసార మాధ్యమాలపై కేసులు నమోదుచేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430ను ఎడిటర్స్ గిల్డ్ తప్పుబట్టింది. జీవో సెన్సార్ షిప్ కిందకే వస్తుందని అభిప్రాయపడింది. పత్రికా స్వాతంత్య్రానికి భంగం కలిగించేలా ఉన్న ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

జీవో 2430తో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం : ఎడిటర్స్ గిల్డ్
author img

By

Published : Nov 8, 2019, 9:34 PM IST

Ediotr guild  demands abolish Go 2430
ఎడిటర్స్ గిల్డ్ లేఖ

పరువుకు భంగం కలిగించే వార్తలు రాస్తే మీడియాపై కేసులు నమోదు చేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 2430 తీసుకురావడంపై... ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జీవో సెన్సార్​షిప్ కిందికే వస్తుందని అభిప్రాయపడింది. తక్షణం జీవోను ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. గిల్డ్ అధ్యక్షుడు శేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఏకే భట్టాచార్య, కోశాధికారి షీలా భట్... ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి శాఖకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులకు కట్టబెట్టిన అపరిమిత అధికారాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని... ఇది పత్రికా స్వాతంత్య్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి :

ప్రధాని మోదీ ఆలోచనను సమర్థిస్తున్నాం: చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.