ETV Bharat / city

రాత్రి వేళలో చపాతీ.. ఏమైనా ఆరోగ్య ఫలితం ఉంటుందా..?

బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ (గోధుమ పిండితో తయారు చేసింది) తీసుకోవడం కూడా ఇలాంటిదే! మరి, నిజానికి దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందంటారా?

how to weight loss
eating chapati at night
author img

By

Published : Apr 24, 2021, 5:12 PM IST

బరువు తగ్గేందుకు చాలామంది రాత్రిళ్లు చపాతీ తింటుంటారు. దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందా అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. అయితే ఆ సందేహం అక్కర్లేదని, రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్క రాత్రి పూట అనే కాదు.. రోజులో ఒకసారి చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందట! మరి, ఆలస్యం చేయకుండా చపాతీలో దాగున్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి.

పోషకాల సమ్మేళనం!

చపాతీని పోషకాల సమ్మేళనంగా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు కాపర్‌, జింక్‌, అయోడిన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, పొటాషియం, క్యాల్షియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంటే.. ఇవన్నీ రోజువారీ శరీరానికి కావాల్సిన పోషకాలను కొద్ది మొత్తాల్లో భర్తీ చేస్తాయన్నమాట!

చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

బరువు తగ్గడానికీ ఇది మంచి ఆహారం అంటున్నారు నిపుణులు. అదెలాగంటే రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ఆకలేయకుండా, ఇతర చిరుతిళ్ల పైకి మనసు మళ్లదు. అలాగే ఇతర పదార్థాలతో పోల్చితే ఇందులో క్యాలరీలూ తక్కువే! కాబట్టి నిశ్చింతగా బరువు తగ్గేయచ్చు.

chapathibenefitsghg650-3.jpg
కాలరీలు తక్కువే..
  • రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ రోటీ/చపాతీ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే పోషక విలువలే ఇందుకు కారణమట!
  • రక్తహీనతతో బాధపడే వారు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చపాతీల్లో ఉండే అధిక ఐరన్‌ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. తెల్ల రక్తకణాలు పెరగడంలోనూ ఈ ఆహారం తోడ్పడుతుంది.
  • చపాతీల్లో ఉండే జింక్‌, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయట! తద్వారా చర్మ సమస్యలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.
chapathibenefitsghg650.jpg
రోగనిరోధక శక్తి పెంచుతుంది
  • ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థకూ మంచిదే! అజీర్తి, గ్యాస్‌, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
  • చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్‌ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతుంది. అందుకే రోజూ చపాతీ తినే వారికి పలు రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు తక్కువ అని చెబుతున్నారు నిపుణులు.
  • గుండె ఆరోగ్యానికీ చపాతీ మేలు చేస్తుందట! ఇందుకు దీనిలో అతి తక్కువ కొవ్వులుండడమే కారణమట! తద్వారా గుండెకు, ఇతర శరీర అవయవాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.
  • జ్వరంగా అనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చే పదార్థం చపాతీ. ఇందులోని పోషకాలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి జ్వరాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇంకా దీన్ని చల్లటి పాలల్లో వేసుకొని తింటే మరింత మంచి ఫలితం ఉంటుందట!

ఇలా చేసుకోవడం ఆరోగ్యదాయకం!

chapathibenefitsghg650-1.jpg
ఇలా చేసుకోవాలి
  • చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని మీకు నచ్చినట్లుగా ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత తక్కువ నెయ్యి/నూనెను వాడడం మంచిదంటున్నారు. అసలు ఈ రెండూ వాడకుండా పుల్కా చేసుకొని తింటే మరీ మంచిదట!
  • బయట దొరికే గోధుమపిండిలో మైదా కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే సకల ప్రయోజనాలూ చేకూరతాయి.
  • చపాతీకి జతగా రోజూ పప్పు, బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
  • బీన్స్‌, క్యారట్‌ ముక్కలు, పాలకూర.. వంటి వాటిని ఉడికించి.. గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో వేసి చపాతీ చేసుకుంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం! కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.
  • గోధుమపిండికి రాగి పిండి, సోయాబీన్‌ పిండి, చిరుధాన్యాలతో తయారుచేసిన పిండి.. వంటివి కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్‌ పిండిని కూడా వాడుకోవచ్చు. అయితే అందులో మైదా 0%గా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విషయం లేబుల్‌ చూస్తే అర్థమవుతుంది.

ఆరోగ్యానికి చపాతీ మంచిది కదా అని ఎన్ని పడితే అన్ని లాగించారంటే అజీర్తి చేసే ప్రమాదం ఉంది.. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు చపాతీలు.. అది కూడా మీడియం సైజులో ఉన్నవి చాలంటున్నారు నిపుణులు.

ఇదీ చదవండి:

కీలక కేసులు.. చారిత్రక తీర్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.