Earthquake In Telangana : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి, బుధవారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా సొంపేట సమీపంలో మంగళవారం రాత్రి భూమి కంపించగా.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామస్తాపూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి.
ఆందోళన అవసరం లేదు..
Earthquake In Telangana Today : ఈ ప్రాంతాల్లో గతంలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) భూకంప అధ్యయన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ అన్నారు. చిన్న భూ ప్రకంపనలేనని ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.
అధ్యయనం చేస్తున్నాం..
Earthquake In Telugu States : ‘సొంపేటలో మంగళవారం రాత్రి 10.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. మా అబ్జర్వేటరీలో భూకంప లేఖినిపై తీవ్రత 3.2గా నమోదైంది. ఈ ప్రాంతంలో గతంలోనూ వచ్చాయి. వీక్‌జోన్ పరిధిలో ఇది ఉంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామస్తాపూర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 12.38 గంటలకు భూమి స్వల్పంగా కన్పించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.4గా నమోదైంది. ఇక్కడ 2014లో వచ్చింది. లోపాలపై అధ్యయనం జరుగుతోంది’. - డాక్టర్ రవికుమార్, ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త
పరుగులు తీసిన జనం..
Earthquake In Telugu States Today : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్, పట్లూర్, బూచన్‌పల్లి, రావులపల్లి, కోటమర్పల్లి, దామస్తాపూర్ తండా తదితర గ్రామాల్లో మధ్యాహ్నం భూమి కదిలినట్లు అయిందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. శబ్దాలకు భయపడి ఇళ్లలోంచి పరుగులు తీశారు.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల పరిధిలోని బిలాల్‌పూర్, గొట్టిగార్‌పల్లి, పైడిగుమ్మల్, మనియార్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం 12:46గంటలకు 5 నుంచి 10 సెకన్ల పాటు భూమి కంపించింది.
ఇదీ చదవండి : tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..