ETV Bharat / city

సర్పంచి, గ్రామ పంచాయతీ విధులు - బాధ్యతలేంటీ..?

author img

By

Published : Feb 1, 2021, 7:54 PM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై జోరుగా చర్చ నడుస్తోంది. గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉండే ప్రథమ పౌరుణ్ని ఎన్నుకోవడానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. అయితే ఎందుకు ఏకగ్రీవం చేసుకున్నారు అని ఎవరైనా అడిగితే.. 'మా సర్పంచి మంచిగా పనిచేశారు' అని చెప్తారు. అసలు పంచాయతీ, సర్పంచి విధులేంటీ..? పల్లెల్లో ప్రథమ పౌరుడు ఏం చేయాలి..? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం.

Duties and Responsibilities of Sarpanch
Duties and Responsibilities of Sarpanch

గ్రామాల్లో నిత్యం ఎదో ఒక సమస్య ప్రజలను వేధిస్తుంటుంది. ఆ సమస్య పరిష్కారానికి ప్రజలు నేతల చుట్టూ తిరుగుతారు. పెద్ద సమస్య అయితే.. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతల వద్దకు తమ గోడు వెళ్లబోసుకుంటారు. కానీ చిన్నచిన్న సమస్యలు ఎవరికి చెబుతారు..? స్థానికంగా ఉండే తమ సర్పంచికి వివరించి.. పరిష్కారం అయ్యేలా చూసుకుంటారు. గ్రామాల్లో చాలా పనులు పంచాయతీ, సర్పంచి చేయాల్సినవే ఉంటాయి. వీధి దీపాల దగ్గర్నుంచి.. పారిశుద్ధ్య నిర్వహణ వరకు అన్నీ తానై సర్పంచి చూసుకోవాలి.

సర్పంచి విధులు...

  • గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సర ఆదాయవ్యయ లెక్కలు, గత పరిపాలన, ఆడిట్‌ నివేదికలను ఆమోదించడం.
  • గ్రామ పంచాయతీ అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు.
  • భవిష్యత్తులో చేపట్టే పనులు, బడ్జెట్‌లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం.
  • పన్నుల మార్పుల ప్రతిపాదనలు, పన్ను బకాయిదారులను, కొత్త కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపిక జాబితా రూపొందించడం.
  • సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం.
  • అన్నివర్గాల మధ్య శాంతి, ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.

పంచాయతీ విధులు...

  • వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ
  • ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల నివారణ చర్యలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
  • గ్రామ ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ
  • జనన, మరణాల నమోదు
  • పరిధిలోని మార్కెట్ల నిర్వహణ
  • పశుగ్రాసాన్నిచ్చే పచ్చికబయళ్ల పెంపకం నిర్వహణ
  • తాగునీరు సరఫరా
  • మహిళా శిశు సంక్షేమం
  • జనగణనకు సహాయం
  • వ్యవసాయం, వర్తక వాణిజ్యాల వృద్ధి
  • భూమి అభివృద్ధి, భూసంస్కరణలకు సహాయం
  • రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధుల నిర్వహణ, భూమి శిస్తు వసూలు
  • ప్రాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ
  • సేంద్రీయ ఎరువుల తయారీ
  • ఎరువు నిల్వకు స్థలాల కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.