ETV Bharat / city

సుక్క కిక్కులో మందుబాబు హల్‌చల్‌.. తనపై తానే దాడి..! - అమరావతి వార్తలు

సుక్క నోట్లోపడితే చాలు కొందరు మందుబాబులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలాగే తెలంగాణలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తనను తాను గాయపర్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా.. రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ అక్కడున్న వారిని హడలెత్తించాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి మందుబాబును ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

drinker nuisance at hyderabad
మద్యం మత్తులో హల్ చెల్ చేసిన మందుబాబు
author img

By

Published : Apr 23, 2021, 11:00 PM IST

మద్యం మత్తులో హల్ చెల్ చేసిన మందుబాబు..

హైదరాబాద్‌ పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మందుబాబు హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో తనను తాను గాయపర్చుకున్నాడు. ఉప్పుగూడ జండా ప్రాంతంలోని వైన్స్‌ సమీపంలో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న మందుబాబును అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఎవరు, ఇలా ఎందుకు ప్రవర్తించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సీసా పగులగొట్టి, తనని తాను గాయపర్చుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి:

ఇంజినీరింగ్, వృత్తివిద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఆరుగురు ఆన్​లైన్​లోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.