ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి చేటు కలిగిస్తాయి. ఇవి వాడవద్దని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా... పూర్తి స్థాయిలో మాత్రం నిరోధించలేకపోతున్నాయి. తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు ప్రస్తుతం వినియోగిస్తున్నా... దీని వలన కూడా హానీ కలిగుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు జలాశయాల్లో కలిసి నీరు కలుషితమవుతోంది. వీటిని తగలబెట్టడం వలన వాయు కాలుష్యం ఏర్పాడుతోంది. వీటి స్ధానంలో పర్యావరణ హిత సంచులను తీసుకురావాలని భావించిన డీఆర్డీవో... ఎకోలాస్టిక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నూతన సాంకేతికతతో రూపొందించిన సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కూరగాయల వ్యర్థాలు, సేంద్రీయ రసాయనం, కూరగాయల నూనెతో కంపోస్టబుల్ సంచులను తయారు చేశారు.
పర్యావరణానికి, పశువులకు ముప్పు ఉండదు..
కంపోస్టబుల్ సంచులు వాడిన తరువాత మట్టి, నీటిలో కరిగిపోతాయి. ఎరువుగా కూడా పనిచేస్తాయి. చేపల అక్వేరియంలో సంచులు పారవేస్తే వాటికి ఆహారంగా మారుతుంది. పశువులు వీటిని తిన్నా ఎటువంటి ముప్పు ఉండదని ఎకోలాస్టిక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ హిత సంచులను డీఆర్డీవో డైరెక్టర్ డాక్టర్ రామ్ మనోహర్ బాబు విడుదల చేశారు. ఈ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని ఎకోలాస్టిక్ సంస్థ భావిస్తోంది.
బయో డీగ్రెడబుల్ ప్రొడక్టులను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గొప్ప సందర్భం. పర్యావరణానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఎకోలాస్టిక్ సంస్థ ముందుకు రావడం, వారు దీనిపై పరిశోధన చేసి పర్యావరణానికి ఉపయోగపడే ఉత్పత్తులు అందిచడం అభినందనీయం
- డాక్టర్ రామ్ మనోహర్ బాబు, డీఆర్‌డీఓ డైరెక్టర్.
అదే పెద్ద సమస్య..
ప్రస్తుతం వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తుంటారు. అది బయట పడేస్తే 400 ఏళ్లైనా భూమిలో కలిసిపోదు. ఇది ప్రపంచంలోనే చాల పెద్ద సమస్యగా తయారైంది. మనం తయారు చేసింది బయో డీగ్రెడబుల్ కంపోస్టబుల్ ప్రొడక్ట్. దీనికి రెగ్యులర్ ప్లాస్టిక్‌కు తేడా ఏమిటంటే.. ఈ ప్రొడక్ట్ మనం చేయడమే స్టార్చ్‌లో ఇస్తాం. స్టార్చ్, వెజిటేబుల్ ఆయిల్స్ నేచర్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్‌తో చేస్తాం. బ్యాక్టీరియా దాన్ని తినడానికి, నేచర్‌లో కలిసిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్‌లను బయటపడేసినా కాని పర్యావరణానికి ఎలాంటి కలుషితం అవ్వదు.
- పురుషోత్తం, ఎకోలాస్టిక్ సంస్థ డైరెక్టర్.
డిమాండ్‌ను బట్టి సంచులను ఉత్పత్తి చేస్తామని, ప్రస్తుతం అనేక సంస్థలు పర్యావరణహిత సంచులను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయని ఎకోలాస్టిక్ సంస్థ చెబుతోంది.
ఇదీ చదవండి: krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు