Surabhi Natakam: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి పొందనున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి (Yadadri Temple)... చారిత్రక ఆవశ్యకత, పునర్ నిర్మాణం వైభవం, ఆలయ విశిష్టతను... రాష్ట్రవ్యాప్తంగా వినిపించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం నాటకాల్లో వందల ఏళ్ల అనుభవం ఉన్న సురభి కళాకారుల(Surabhi Natakam)ను రాష్ట్ర భాష, సాంస్కాృతిక శాఖ ఎంపిక చేసుకుంది.
సుమారు 45 నిమిషాలపాటు...
ప్రభుత్వ సలహాదారు రమణచారి సూచనలతో సురభి అవేటి రఘునాథ్... యాదాద్రి ఆలయం, స్థలపురాణంపై ప్రత్యేక నాటకాన్ని సిద్ధం చేశారు. తన స్వీయ రచన, దర్శకత్వంలో శ్రీ యాదాద్రి మహోద్భవం పేరిట పద్యనాటకం రూపొందించారు. సుమారు 45 నిమిషాలపాటు సాగనున్న ఆ పౌరాణిక పద్యనాటకాన్ని అధునిక హంగులతో ప్రదర్శించాలని నిర్ణయించారు. దాదాపు 45 రోజులుగా లింగంపల్లిలోని సురభి కళాకారులంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారు.
నాటకంపై పట్టు...
పెద్దల నుంచి పిల్లల వరకు అంతా నాటకంపై పట్టుసాధించారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు లింగంపల్లి సురభికాలనీలోని శ్రీ అవేటి మనోహర్ సురభి కళామందిరం (Surabhi Natakam) వేదికగా... యాదాద్రి నాటక ప్రదర్శన జరుగనుంది. ఏటా ఈ వేదికపై కొత్త నాటకాలను ప్రదర్శించే సంప్రదాయం ఉండటంతో ఈ ఏడాది అనుకోకుండా దివ్యక్షేత్రమైన యాదాద్రి నాటక ప్రదర్శన రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కళాకారులు చెబుతున్నారు.
మరో మెట్టు ఎక్కువగా...
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే అన్ని రకాల హంగులతో... నాటకాన్ని తీర్చిదిద్దినట్లు సురభి కళాకారులు చెబుతున్నారు. సంగీతపరంగా, సాంకేతికంగా సురభి నాటకాల స్థాయి కంటే మరో మెట్టు ఎక్కువగా ఉండేలా యాదాద్రి నాటకం ఉంటుందని తెలిపారు. స్థల పురాణాన్ని కొత్తగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు సురభి కళాకారులతో నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
అద్భుతం...
యాదాద్రి మహోద్భవం పేరిట తయారు చేసిన నాటకం... ఇప్పటివరకు తాము చేసిన వాటిలోనే అద్భుతమంటున్న కళాకారులు... ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: