కరోనా వైరస్ ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొవిడ్ రోగులు, కోలుకున్నవారు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నారు.
ఊపిరితిత్తులపై కొవిడ్ ప్రభావం, ఏ స్థాయిలో పరిస్థితి విషమంగా మారుతోంది, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, కోలుకున్న తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై అనేక మంది ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ప్రశ్నలు అడిగారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి యాభైకి మందికి పైగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సమాధానాలు ఇచ్చారు.
వైరస్ వేరియంట్ల కారణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వివరించారు. ఈ కారణంగానే యువత కూడా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారని ఆయన చెప్పారు. కోలుకున్న వారు మూడు నెలల వరకు జాగ్రత్తగా ఉండి.. ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పర్చుకునే వ్యాయామం చెయ్యాలని, పౌష్ఠికాహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: