కృష్ణాజిల్లా ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని రాజధాని ప్రాంత వాసులు కలిశారు. పది రోజులుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజధానిపై వివాదాస్పద ప్రకటనలు చేయటం పట్ల వెంకయ్య వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వ్యవసాయ భూములను రాజధాని అమరావతికి ఇచ్చామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోగా...లేనిపోని అపోహలకు కల్పిస్తూ తమలో ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించిన వెంకయ్య...ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు కాబట్టి ఆందోళన అవసరం లేదన్నారు. త్వరలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ధైర్యం చెప్పారు.
ఇదీచదవండి