కరోనా మహమ్మారిపై పోరుకు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. హెటెరో గ్రూప్ రూ.5 కోట్లు విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వంశీ కృష్ణ.. ముఖ్యమంత్రి జగన్‌కు చెక్కు అందజేశారు. రూ.కోటి విలువైన ఔషధాలు, మాస్కులు, పీపీఈలు అందించామని.. నక్కపల్లిలో ఔషధాలు, నిత్యావసరాలకు మరో రూ.2 కోట్లు ఇచ్చినట్లు హెటెరో గ్రూప్ తెలిపింది.
విరాళాల వివరాలు
- దేవీ సీ ఫుడ్స్ సంస్థ ఎండీ బ్రహ్మానందం రూ.కోటి విరాళం
- తితిదే ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.84 లక్షలు విరాళం
- ఆర్జాల్ స్టీల్ సంస్థ కోటి 45 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి నగదు బదిలీ పత్రాన్ని సీఎస్‌కు అందించారు. అనంతపురం కలెక్టర్ ఫండ్‌కు రూ.20 లక్షలు, అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రూ.25 లక్షలు ఆర్జాల్ స్టీల్ సంస్థ ఇచ్చింది. రూ.25 లక్షల విలువైన 5 వెంటిలేటర్లు కూడా అందించనున్నట్లు ఆ సంస్థ ఎండీ శ్రీధర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ