తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి లాక్కెళ్లాయి. స్థానిక బస్ డిపో ముందు కాలనీలో నందిని అనే చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క దాడి చేసింది. దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. కుక్క దాడిచేయడంతో చిన్నారి అరుపులకు స్థానికులు వచ్చి నందినిని కాపాడారు.
వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల దాడిలో చిన్నారి కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి వెంటనే కుక్కలు, పందుల స్వైర విహారాన్ని అరికట్టాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.