ETV Bharat / city

Dog Bite humans: కుక్కల దాడి... 17 మందికి తీవ్రగాయాలు - sircilla district latest news

ఇంటి ఎదుట ఆనందంగా చిన్నారులు ఆడుకుంటున్నారు. బయట కూర్చొని పెద్దలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ... ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా 17 మందిని (Dog Bite humans) కరిచాయి. ఈ ఘటన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Dog Bite humans
Dog Bite humans
author img

By

Published : Sep 30, 2021, 11:50 AM IST

Dog Bite humans: కుక్కల దాడి... 17 మందికి తీవ్రగాయాలు

కుక్కలు విశ్వానికి మారుపేరు. కానీ ఈ శునకాలంటేనే తెలంగాణలోని సిరిసిల్ల​ వాసులు భయపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కరుస్తూ గాయపరుస్తున్నాయి. కుక్కల సంఖ్య పెరగడంతో ఏ వీధిలో చూసినా గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఉండటం వల్ల వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనితో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కుక్కల దాడిలో(Dog Bite humans) 17 మందికి తీవ్రగాయాలయ్యాయి.

పట్టణంలోని సిద్ధార్థ నగర్​, మెహర్​ నగర్​ ప్రాంతాల్లో కుక్కలు రాత్రివేళ తిరుగుతూ అడ్డొచ్చిన వారిని 17 మందిని కరిచాయి. ఓ చిన్నారిపై దాడి చేస్తుండగా.. తల్లిదండ్రులు అడ్డుకునే ప్రయత్నం చేసినా... వదిలిపెట్టలేదు. చిన్నారితో సహా మరో 16 మందిపై కుక్కలు దాడి (Dog Bite humans) చేశాయి. కాళ్లు, చేతులపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడుల్లో తీవ్రగాయాలపాలైన బాధితులు.. సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నేను పనికి వెళ్లి నడుచుకుంటూ వస్తున్నాను. అక్కడ పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు... వెనకాల నుంచి వచ్చి... కాలును కరిచింది.

- బాధితురాలు

ఈ ఘటనతో జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తింది. జన సంచారం అధికంగా ఉండే సమయంలోనే కాపుకాసి మరీ దాడి చేస్తున్నాయి. పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు విపరీతమైన భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని గాయపరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులపై దాడి చేస్తూ చంపేస్తున్నాయి. కుక్కల నియంత్రణకు అధికారులు చోరవ తీసుకుని, పిల్లలను కుక్కల బెడద నుంచి కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

  1. ఇదీ చదవండి : RED SANDEL: ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.