ETV Bharat / city

మర్యాద లేనిచోట పని చేయలేం... సీఎస్‌కు వైద్యుల సంఘం లేఖ

వైద్యుల స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వలేని పక్షంలో కొవిడ్‌-19 విధుల నుంచి తప్పుకొనేందుకు అనుమతివ్వాలని వైద్యుల సంఘం కోరింది. కొత్తగా నియమిస్తున్న వైద్యులు, ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

Doctors Association letter to CS
సీఎస్‌కు వైద్యుల సంఘం లేఖ
author img

By

Published : Jul 9, 2020, 7:02 AM IST

వైద్యాధికారులు, ఉన్నతాధికారుల వల్ల తరచూ అవమానాలు, దూషణలకు గురవుతున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. కొవిడ్‌-19 విధుల్లో పనిచేసే వాతావరణం లేనందున వైద్యులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యుల స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వలేని పక్షంలో కొవిడ్‌-19 విధుల నుంచి తప్పుకొనేందుకు అనుమతివ్వాలని కోరింది. కొత్తగా నియమిస్తున్న వైద్యులు, ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ‘రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ తరచూ వీడియో సమావేశాల ద్వారా ఆచరణ సాధ్యం కాని విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలకు వైద్యులు హాజరుకావడం ఇబ్బందికరంగా మారింది. కనీసం 15 రోజులకోసారి వీడియో సమావేశాలు నిర్వహించాలి. టీకాల కార్యక్రమం నూటికి నూరుశాతం ఎక్కడా జరగదు. కొత్త యాప్‌లకు తగ్గట్లు వివరాలు నమోదు చేయడం వైద్యులకు సాధ్యం కావడం లేదు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్వహణ వైద్యాధికారుల బాధ్యతల్లో లేదు.

డీఎంహెచ్‌వోలపై ఒత్తిడి

జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో డీఎంహెచ్‌వోలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం డీఎంహెచ్‌వోను.. సమావేశ ప్రారంభ సమయం కంటే కాస్త ఆలస్యంగా వచ్చారని జాయింట్‌ కలెక్టర్‌ నిల్చోబెట్టారు. అనంతపురం డీఎంహెచ్‌వోను సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా దూషించారు. శ్రీకాకుళం, నెల్లూరు డీఎంహెచ్‌వోలను సెలవుపై వెళ్లాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేశారు. కొవిడ్‌-19 పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా సంయుక్త కలెక్టర్లకు అప్పగించిన అనంతరం పరిస్థితులు దుర్లభంగా మారుతున్నాయి. విజయవాడ, తెనాలి, ఏలూరులో వైద్యులు మరణించినా ఇప్పటివరకు నష్టపరిహారం ప్రకటించలేదు. హైదరాబాద్‌, బెంగుళూరు నగరాల్లో వైద్యసేవలు పొందే అవకాశాన్ని కల్పించాలి. శ్రీకాకుళం జిల్లా అధికారులు ఆర్‌ఎంపీలతో సమావేశం జరపడం తగదు’ అని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ డి.జయధీర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

జలవనరులశాఖలో 198 పనుల ఒప్పందాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.