ETV Bharat / city

పారదర్శకంగా వైద్యఖాళీలు భర్తీ చేశాం: డీఎంఈ - డైరెక్టు రిక్రూట్​మెంట్ ద్వారా వైద్యఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకుల పరిధిలోని ఆసుపత్రులు, సంబంధిత వైద్య కళాశాలలో మిగిలి ఉన్న 737 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆన్​లైన్ విధానం ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని డీఎంఈ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి జీవో నెం.154 ద్వారా 60:40 నిష్పత్తిలో భర్తీ చేశామన్నారు.

Dme comments On Doctors Recruitment
డీఎంఈ డాక్టర్ వెంకటేష్
author img

By

Published : Nov 7, 2020, 7:46 AM IST

డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో చేపట్టిన వైద్యుల భర్తీ ప్రక్రియ... డైరెక్టు రిక్రూట్​మెంట్, లేటరల్ ఎంట్రీ విధానం పారదర్శకంగా జరిగిందని డీఎంఈ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సెలక్షన్ కమిటీ అనుమతితో నియామకాలు చేపట్టామన్నారు. ఈ రిక్రూట్​మెంట్​లో ఏ స్థాయిలోనూ రాతపూర్వకంగా, ఆన్​లైన్ ద్వారా ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. భర్తీలో ఎవరికైనా అభ్యంతరాలుంటే అభ్యర్థలు నేరుగా తన కార్యాలయానికి రావచ్చని డీఎంఈ తెలిపారు. సిబ్బంది ఎవరైనా అవకతవకలు పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకుల పరిధిలోని ఆసుపత్రులు, సంబంధిత వైద్య కళాశాలలో మిగిలి ఉన్న 737 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆన్​లైన్ విధానం ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని డీఎంఈ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి జీవో నెం.154 ద్వారా 60:40 నిష్పత్తిలో భర్తీ చేశామన్నారు. మెుత్తం సెలక్షన్ ప్రక్రియ మెరిట్, వివిధ వెయిటేజీల ఇవ్వటం ద్వారా ప్రభుత్వ అనుమతులకు లోబడి పూర్తి పారదర్శకంగా చేశామన్నారు. ఎంపికైన మెరిట్ అభ్యర్థుల వివరాలను ఆన్​లైన్​లో పొందుపరిచారు. వాటిపై వచ్చిన అభ్యంతరాలకనుగుణంగా సరిచేసి ఫైనల్ మెరిట్ అభ్యర్థుల వివరాలను కమిటీ ఆమోదించిన తర్వాత వెబ్ సైట్లో పొందుపర్చి సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.

లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయుటకు సంబంధిత వైద్య శాఖలో పనిచేసే వారి మెరిట్, ఆయా శాఖాధిపతుల ద్వారా ఇవ్వబడిన ర్యాంకింగ్​లకు లోబడి భర్తీ చేశామన్నారు. ఈ ప్రక్రియలో మొత్తం ఖాళీల సంఖ్య ప్రభుత్వ అనుమతితో పొందుపరిచినట్లు వైద్యాధికారులు చెపుతున్నారు. ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యమవటంతో లేటరల్ ఎంట్రీ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రమోషన్స్ ఇచ్చామన్నారు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరిగిందని డీఎంఈ తెలిపారు.

ఇదీ చదవండి: సంచార లైబ్రరీలో ఆసక్తికరమైన పుస్తకాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.