ETV Bharat / city

Umbrella : ఎక్కడికెళ్లినా.. గొడుగు తీసుకెళ్తున్నారా?

‘స్వాతీముత్యపు జల్లులలో... శ్రావణ మేఘపు జావళిలో...’ అంటూ పాటలు పాడుకుంటూ కాసేపు చిరుజల్లుల్లో తడవడం ఆనందంగానే ఉంటుంది కానీ, ఆ వాన జడివానై నిలువెల్లా తడిపేసినప్పుడే... తట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే వానాకాలంలో ఎక్కడికెళ్లినా వెంట గొడుగు(Umbrella) ఉండాల్సిందే. అయితే అది కూడా ఏదో సాదాసీదాగా కాకుండా కాలానికి తగ్గట్లుగా ఎన్నో అందాల్నీ సాంకేతికతనీ జోడించుకుని మరీ వస్తోంది..!

Umbrella
Umbrella
author img

By

Published : Jul 18, 2021, 1:56 PM IST

ఎండ వేడికి బండబారిన మట్టి సైతం తొలకరి చినుకుల పలకరింతకి పరవశంతో పరిమళిస్తుంది. అలాంటిది వర్షానికి పులకరించని మనసు ఉంటుందా... కానీ ఆ వానలో తడిస్తే వచ్చే జలుబూ జ్వరాల నుంచి తప్పించుకుని తిరగాలంటే ఎవరికైనా చేతిలో గొడుగు(Umbrella) తప్పనిసరి. అయితే పూర్వంకాలంనాటి నల్లనిదో నిన్నమొన్నటి చుక్కల డిజైను గొడుగో ఉంటే చాలు అనుకోవడం లేదు నేటి తరం. ఎంతో కళాత్మకంగానూ వినూత్నంగానే కాదు, స్మార్ట్‌గానూ ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గొడుగులు ఆనాటి కళలూ ఈనాటి త్రీడీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుని మరీ వస్తున్నాయి. అవునుమరి, కొందరు కళాకారులు మధుబని, పటచిత్ర, కలంకారి... వంటి కళారూపాల్ని ఛత్రాలమీదాచిత్రిస్తున్నారు. అలాగే ఇంటీరియర్‌, ఫ్యాషన్‌ డిజైన్లలో కొత్త ట్రెండ్‌కు తెరతీసిన త్రీడీ ప్రింట్లు ఇప్పుడు గొడుగుల(Umbrella)మీదా వస్తున్నాయి. ఎంత పెద్ద వానొచ్చినా పెద్దగా తడవకుండా ‘యూ’ ఆకారంలో భుజాల వరకూ ఉండేవీ ఉంటున్నాయి. గుంపులో నడిచేటప్పుడు దగ్గరగా ముడుచుకుని దారి ఇచ్చేవీ, పక్కవాళ్లకు గుచ్చుకోకుండా ఏరో డైనమిక్‌ డిజైన్లతో చేసినవీ ఈదురుగాలుల్ని తట్టుకునేలా ఇరవై నాలుగు కడ్డీలున్నవీ... ఇలా ఎన్నో రకాలుగా తయారుచేస్తోన్న ఆధునిక గొడుగుల్లో ఇతరత్రా ఫీచర్లూ చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దామా..!

కలర్​ఫుల్ గొడుగులు

గొడుగుకెన్ని రూపాలో..!

గొడుగుకెన్ని రూపాలో..!

స్కూలూ కాలేజీలూ ఆఫీసుకి వెళ్లేటప్పుడు చేతిలో పెద్ద గొడుగు(Umbrella) పట్టుకెళ్లడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటివాళ్లకోసం మినీ అంబ్రెల్లాలు చాలానే వస్తున్నాయి. ఇవి- అరటిపండు, బొమ్మ, క్యాప్స్యూల్‌, ఫ్లవర్‌ వేజ్‌, పౌచ్‌, లిప్‌స్టిక్‌, వైన్‌, వాటర్‌, పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌... ఇలా అనేక రూపాల్లో వస్తున్నాయి. వీటిని చేతిలో పట్టుకున్నా స్టైలిష్‌గానూ ఉంటాయి, ఎంత చిన్న బ్యాగులోనైనా పట్టేస్తాయి. అన్‌సీజన్‌లో షోకేసులో బొమ్మల్లానూ ఉంచవచ్చు.

వానొస్తే రంగు పడుద్ది!

వానొస్తే రంగు పడుద్ది!

ఈ డిజైనర్‌ సూపర్టైల్‌ అంబ్రెల్లా ఉన్నవాళ్లెవరైనా ‘కురిసింది వానా... నా గొడుగు(Umbrella)మీదా... హరివిల్లు విరిసేలా...’ అంటూ హాయిగా పాడుకోవచ్చు. ఎందుకంటే అప్పటివరకూ తెలుపు రంగులో ఉన్న డిజైన్‌ కాస్తా వానలోకి వెళ్లగానే నీటిని పీల్చుకుని రంగుల్లోకి మారిపోతుంది. కొన్ని గొడుగులైతే మామూలప్పుడు సాదాగా ఉండి వానలోకి వెళ్తే డిజైన్‌ కనిపిస్తుంది. హైడ్రో క్రోమిక్‌ రంగులతో తయారైన ఈ గొడుగుల్ని పిల్లలుగానీ వేసుకుంటే ‘రెయిన్‌ రెయిన్‌ గో ఎవే...’ అంటూ తెగ సరదా పడతారంటే పడరు మరీ!

ఫొటో గొడుగులు!

ఫొటో గొడుగులు!

అది నేనే... ఇది నేనే... అన్నట్లుగా కొందరికి తాము వాడే ప్రతి వస్తువుమీదా తమ పేరుగానీ ఫొటోగానీ ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగానే కప్పులూ మగ్గులూ టీషర్టులూ... ఇలా అన్నీ చేసినట్లే గొడుగుల్నీ కస్టమైజ్‌ చేస్తున్నారు. వాటికి సంబంధించిన వెబ్‌సైట్లోకి వెళ్లి తమవో కుటుంబసభ్యులవో పెంపుడు జంతువులవో ఫొటోలను ఇచ్చి గొడుగుల్ని డిజైన్‌ చేయించుకోవచ్చు. ఇవి కానుకలుగా ఇచ్చేందుకూ బాగుంటాయి.

తిరగేస్తే నిల్చుంటుంది!

తిరగేస్తే నిల్చుంటుంది!

నీటిని పీల్చని పాంగీ పాలియెస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ ఓవెన్‌ కైనె గొడుగుని పెట్టడానికి ఏ గోడ చేర్పో ఉండాల్సిన అవసరం లేదు. బటన్‌ను ప్రెస్‌ చేసి హ్యాండిల్‌ని పైకి తిప్పి పట్టుకుంటే చాలు... అది ఆటోమేటిగ్గా కిందకి ముడుచుకుపోవడమే కాదు, కింద పెట్టేస్తే నిలబడి ఉంటుంది. నీళ్లన్నీ కిందకి కారి త్వరగా ఆరిపోతుంది కూడా. ఇదొక్కటే కాదు, స్టాండుతో వస్తోన్న గొడుగుల్లో ఇంకా వెరైటీలు చాలానే ఉన్నాయి.

పాటలు వింటూ... మాటలు చెబుతూ..!

పాటలు వింటూ... మాటలు చెబుతూ..!

‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ అంటూ పాడుకోవడానికి ఇది కరోనా కాలం... కాబట్టి మాటలైనా పాటలైనా గొడుగుతోనే అనుకుని, వర్షాన్ని ఎంజాయ్‌ చేస్తూ నడవాలనుకునేవాళ్లకి ఈ ఫోన్‌బ్రెల్లా చక్కగా సరిపోతుంది. బ్లూటూత్‌ ద్వారా దీన్ని ఫోనుకి కనెక్ట్‌ చేసుకుంటే హ్యాండిల్‌లో అమర్చిన మైక్రోఫోనూ స్పీకరు ద్వారా అక్కడ ఉన్న బటన్‌ ఆన్‌, ఆఫ్‌ చేసుకుంటూ పాటలూ వినొచ్చు. కాల్‌ చేసిన స్నేహితులతో కబుర్లూ చెప్పొచ్చు.

బ్యాగులా మారిపోతుంది!

బ్యాగులా మారిపోతుంది!

నీరు పీల్చకుండా టెఫ్లాన్‌ క్లాత్‌తో చేసిన మంచి గొడుగై(Umbrella)నా దాన్ని మడిచినప్పుడు కొన్ని చుక్కలయినా కిందకి కారకుండా ఉండవు. ఆఫీసుకో షాపింగుకో వెళ్లినప్పుడు వాటిని తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వెనక్కి తిప్పి బ్యాగులా మడిస్తే నీళ్లేవైనా ఉంటే లోపలే ఉండిపోతాయి. పైగా వాన తగ్గిపోతే దీన్ని బ్యాగులా చేత్తో పట్టుకునీ వెళ్లొచ్చు. వర్షం లేనప్పుడు బ్యాగులా మడిచిన గొడుగులో చిన్న చిన్న వస్తువులూ వేసుకోవచ్చు.

చీకట్లో ‘ఛత్ర’ కాంతులు!

చీకట్లో ‘ఛత్ర’ కాంతులు!

చీకట్లో వెళ్లేటప్పుడు ఒకచేత్తో గొడుగూ(Umbrella) మరో చేత్తో టార్చ్‌ పట్టుకుని నడవడం చాలా కష్టం. అదే గొడుగుకే ఎల్‌ఈడీ దీపాలు ఉంటే అవి మిణుకు మిణుకుమని వెలుగుతూ దారి చూపుతాయి. అలా వస్తున్నవే ఈ ల్యూమినస్‌ ట్రాన్స్‌పరెంట్‌ అంబ్రెల్లాలు. అంచుల్లోనూ చువ్వలబారునా గొడుగు మొత్తంగా వెలుగులు వెదజల్లేవి కొన్నయితే, రాడ్‌లోనూ హ్యాండిల్‌ చివరా లైటు ఉండేవి మరికొన్ని. ఇక, రంగులు మారుతూ ఏడు రంగుల్లో వెలిగే ఎల్‌ఈడీ గొడుగు వేసుకుని నడుస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు వాన సంగతి మర్చిపోయి, మీ గొడుగును చూస్తుండిపోతారంతే!

వాతావరణాన్నీ చెబుతాయి!

వాతావరణాన్నీ చెబుతాయి!

వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పటం కష్టం అంటుంటారు. నిజమే, మబ్బుగా ఉందని గొడుగు(Umbrella) తీసుకెళితే వాన రాకపోవచ్చు. ఎండ వచ్చింది కదాని గొడుగు లేకుండా నాలుగు అడుగులు వేయగానే కుంభవృష్టి కురవొచ్చు. అదే ఈ ఆంబియెంట్‌ అంబ్రెల్లా ఉంటే ఆ సమస్య ఉండదు. హ్యాండిల్లోని సెన్సర్‌ స్థానిక వాతావరణ వెబ్‌సైట్‌ నుంచి సమాచారాన్ని గ్రహించడంతో అక్కడ నీలి లైటు నాలుగు రకాలుగా వెలుగుతుంది. తుంపర, భారీవర్షం, మంచు, ఉరుములు, మెరుపులు... ఇలా ఒక్కోదానికీ ఒక్కోలా వెలుగుతుందట. కాబట్టి మర్చిపోకుండా గొడుగు వేసుకెళ్లొచ్చు. అయితే గొడుగు సంగతే మర్చిపోయేవాళ్లూ ఉంటారు. వాళ్లకోసం డిజైన్‌ చేసినవే వెదర్‌మ్యాన్‌, హజ్‌, వూంబ్రెల్లాలు. ఇవి ఆప్‌ ద్వారా ఫోన్‌కే మెసేజ్‌ పంపుతాయి. ఎక్కడైనా పెట్టి మర్చి పోయినా ఆ లొకేషన్‌నీ మెసేజ్‌ చేస్తాయి. వూంబ్రెల్లా హ్యాండిల్‌లో ఉన్న సెన్సర్లు వర్షంతోపాటు ఉష్ణోగ్రతనీ చెబుతాయి. వర్షంలో వెళుతున్నప్పుడు ఫోను ఏ బ్యాగులోనో ఉండిపోతే కాల్‌ వచ్చిన విషయాన్ని సూచిస్తూ గొడుగు హ్యాండిల్‌నుంచి బజ్‌.. మనే శబ్దం కూడా వస్తుందట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.