ETV Bharat / city

రాష్ట్రంలోని ఆలయాలకు పటిష్ట భద్రత: డీజీపీ - amaravathi news

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ గౌతం సవాంగ్​ తెలిపారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని డీజీపీ అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై ఆయన... వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

DGP Gautam Sawang
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
author img

By

Published : Sep 13, 2020, 12:03 PM IST

Updated : Sep 13, 2020, 1:04 PM IST

ఆలయాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్​ సూచించారు. గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ సూచించారు.

ఆలయాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయటంతోపాటు.... ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్‌ ఏర్పాటు చేసి...స్థానిక పోలీసు అధికారులు పర్యవేక్షించాలన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: జగన్, సాయిరెడ్డిలకు భయం పట్టుకుంది: కళా

Last Updated : Sep 13, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.