తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనం కోసం లైన్లలో బారులు తీరారు.
ఈ నెల 24 నుంచి జరుగుతున్న చిన్న జాతర ఈ రోజుతో ముగుస్తుండటంతో.. భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పసుపు కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు.
ఇదీచదవండి.