నేడు మరోసారి సీఐడీ విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29న సీఐడీ కార్యాలయంలో 9 గంటలపాటు దేవినేనిని విచారించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలపై దేవినేనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ట్యాబ్, సెల్‌ఫోన్ సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: వైకాపా నేత రెహ్మాన్ మృతి.. .సీఎం జగన్ సంతాపం