ETV Bharat / city

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానులు: దేవినేని - ఏపీలో మూడురాజధానులు

రాజధానిని అమరాతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వెలగపూడిలో అమరావతి జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన...రాజధాని మార్పుపై ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు.

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao
author img

By

Published : Aug 23, 2020, 5:46 PM IST

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే 3 రాజధానులు: దేవినేని

గుంటూరు జిల్లా వెలగపూడిలో రాజధాని పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కార్యాలయం ప్రారంభమైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఐకాస జెండాను ఎగరవేశారు. ఇకపై రాజధానిలో నిర్వహించే కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు.

రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదల్చలేరని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు 3 రాజధానులకు తెరలేపారని ఆయన ఆరోపించారు. రాజధానిలో రూ. 53వేల కోట్ల విలువైన పనులు జరిగాయని అన్నారు. రాజధాని మార్పుపై ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'ఎవరినడిగి రాష్ట్ర రాజధానిని మారుస్తున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.