రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిపై, ఓ వర్గంపైన కక్షతో మూడు రాజధానులు అంటున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా శిబిరాన్ని సందర్శించిన దేవినేని... సీఎం జగన్కు పరిపాలన అనుభవం లేక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతగా జగన్ అనాడు అమరావతికి మద్దతు పలికారని... ఇప్పుడెందుకు 3 రాజధానులంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్తో బిల్లులు ఆమోదించుకున్నప్పటికీ... ఈ నల్ల బిల్లులు న్యాయసమీక్షకు నిలబడవని దేవినేని పేర్కొన్నారు. కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు, మహిళలు పోరాడుతున్నారని... న్యాయస్థానాల్లో వారికి విజయం దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ... అమరావతిలో వెచ్చించిన వేల కోట్ల సంగతేంటి?