పోలవరం భద్రతను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను సీఎం జగన్... తాకట్టు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో మాట్లాడిన ఆయన.. తమవాళ్లకు పనులు అప్పగించేందుకే రివర్స్ టెండరింగ్ నాటకాలన్నారు. స్వార్థపూరిత రాజకీయాలతో గుత్తేదార్లను లొంగదీసుకున్నారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్లో నియమాలు, నిబంధనలు పక్కన పెట్టి తమవారికి టెండర్లు కట్టబెట్టారని అన్నారు. తెదేపాపై బురద చల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందిన దేవినేని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతతో పోలవరం నిర్మాణం పూర్తి అవ్వడానికి మరో ఐదేళ్లు ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో జగన్ పనిచేస్తున్నారన్న దేవినేని... పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ ఒప్పుకున్నారన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో వందలకోట్లు ఆదా చేశామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఇప్పటికే ఆలస్యమైన పోలవరం పనులను మరింత దిగజార్చి మైనస్ 26 శాతానికి తగ్గించి, పోలవరం డ్యామ్ భద్రతతో ఆడుకుంటున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలు నిర్మించి గోదావరి, కృష్ణ నీళ్లను అడ్డుకుంటుంటే.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేసీఆర్తో భేటీ అయ్యారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ఇంజినీర్లు పర్యవేక్షిస్తారా అని నిలదీశారు.
ఇదీ చదవండి: