దశాబ్దాల కాలంగా శాంతియుతంగా ఉన్న మైలవరం ప్రాంతాన్ని అడుగుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మైలవరం ప్రాంతంలో ఎన్నడూ లేనివిధంగా రౌడీ రాజ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు, అధికార దుర్వినియోగంతో పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేసిన వారిని వదిలి దెబ్బలు తిన్న వారిపైనే తిరిగి కేసులు బనాయించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఇదీ చదవండి