విజయవాడ కనకదుర్గ ఆలయ వెండి రథాన్ని తెదేపా నేతలు సందర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఆధ్వర్యంలో నేతలు సింహాల ప్రతిమలను పరిశీలించారు. ప్రతిమలు మాయమైన ఘటనలో మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలన్నారు. వెండి సింహాల మాయంపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు.
ఇదీ చదవండి:
మూడు సింహం ప్రతిమల్లేవు.. విచారణ చేస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి