రాజధాని బలిదానాలకు ముఖ్యమంత్రి, గవర్నర్లే బాధ్యులని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ముఖ్యమంత్రి, గవర్నర్లు ఆగిపోయిన మహిళారైతు గుండెను కొట్టుకునేలా చేయగలారా అని నిలదీశారు. మంత్రి నాని ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నారో.. ఆయన మాటలు ఎవరికి తగులుతాయో.. ముఖ్యమంత్రి ఆలోచించాలని ఉమా హెచ్చరించారు. అమరావతిలో కట్టిన భవనాలన్నీ గ్రాఫిక్స్ అయితే.. కొడాలినాని వాటిపైనుంచి దూకాలని సవాల్ విసిరారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను, పార్లమెంట్ చేసిన చట్టాలను 32కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ఎలా మారుస్తారని నిలదీశారు. బోరుపాలెంలో చనిపోయిన సామ్రాజ్యమ్మ మృతికి వారే కారకులన్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం, లాలూచీ రాజకీయాలకోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. చట్టంద్వారానే అమరావతి ఏర్పడిందనే నిజాన్ని మూర్ఖులంతా తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాన్నిస్వాగతించిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ప్రాంతాలమధ్య చిచ్చు ఎందుకు పెడుతున్నరని నిలదీశారు.
ఇదీ చదవండి: శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్‌కు 67 ఎకరాల భూమి బదిలీ