ETV Bharat / city

పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టండి: ఉపముఖ్యమంత్రి - DEPUTY CM NARAYANASWAMI VIDEO CONFERENCE ON COMERCIAL TAX OFFICERS

కొవిడ్ కారణంగా మందగించిన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 7 నెలలు సమయం మాత్రమే ఉందన్నారు.

DEPUTY CM NARAYANASWAMI VIDEO CONFERENCE ON COMERCIAL TAX OFFICERS
ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
author img

By

Published : Aug 29, 2020, 11:10 AM IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పన్నులు కరోనా నేపథ్యంలో మందగించిన విషయం తెలిసిందేనని.. అధికారులు రాబోయే సెప్టెంబర్ మాసం నుంచి సామరస్యంతో కూడిన ప్రత్యేక కార్యాచరణతో పన్నుల వసూళ్లుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఆదేశించారు. శుక్రవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల, డివిజన్ల కమర్షియల్ టాక్స్ అధికారులతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. విజయవాడ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, కమర్షియల్ టాక్సెస్ రజత్ భార్గవ్ పాల్గొని సమీక్ష నిర్వహించారు.

పన్నుల వసూలు ప్రగతిపై సమీక్ష

కరోనా మహమ్మారి వల్ల తగ్గిన పన్నుల వసూలుపై సెప్టెంబర్ నుంచి దృష్టి పెట్టాలని... ఇక మనకు ఉన్నది 7 నెలల సమయం మాత్రమే అని గుర్తించాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. డివిజన్ల వారీగా పన్నుల వసూళ్ల ప్రగతి పై ఆయన సమీక్షించారు. డిపార్ట్మెంట్​లో అర్హత వున్నవారికి ప్రమోషన్​లు ఇవ్వడం జరిగిందని... అంతే ఉత్సాహంతో పని చేసి పెండింగ్ బకాయిలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పన్నుల బకాయిలతో రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ఆస్తుల వేలం వున్న వారితో మరొకసారి మాట్లాడాలని, ఆవరసరాన్ని బట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వన్ టైమ్ సెటిల్మెంట్ చేసే విధంగా పరిశీలన చేయాలన్నారు.

మెుండిబకాయిలు వసూలు చేయండి..

డివిజన్ వారీగా టార్గెట్ అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అప్పుడే ప్రగతి తెలుస్తుందని ఉపముఖ్యమంత్రి అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలలో పన్నుల వసూలు ఎలా ఉన్నదనే అనే అంశంపై ప్రత్యేక కమిటీని నియమించి... స్టడీ చేయడానికి బృందాన్ని పంపాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి సూచించారు. గత సంవత్సరం బకాయిలు రూ.1,080 కోట్లు రాబట్టడం పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. 2020-21 నాలుగు నెలల కాలానికి సంబంధించి జూలై 2020 మాసం వరకు అతి తక్కువ వసూళ్లు నమోదయ్యాయన్నారు. వాటిలో జీఎస్టీ 59.28 శాతం, పెట్రో ఉత్పత్తులు 63.80 శాతం, లిక్కర్ 23.65 శాతం, వృత్తి పన్ను 50.05 శాతంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

పరిపాలనను మూడు ముక్కలాటగా మార్చారు: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.