సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో విద్యుత్తు ఆదా కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ), కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సహకారం తీసుకుంటామని వెల్లడించింది. ‘రాష్ట్రానికి దశలవారీగా లక్ష ఐవోటీ పరికరాలను అందించేలా ఐఐటీ హైదరాబాద్‌ను సంప్రదించాం. వచ్చే ఐదు నెలల్లో 10 వేల పరికరాలు వస్తాయి. వాటిని ఎంఎస్‌ఎంఈలకు అందించటానికి పరిశ్రమల శాఖ సహకారం తీసుకుంటాం. విద్యుత్ బిల్లులో ఏటా రూ.80 వేల వరకు వారికి ఆదా అవుతుంది’ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి..
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తుది దశకు నివేదిక