ETV Bharat / city

భారీగా సెక్షన్లు పెంచుతున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు - ap latest news

కరోనాతో డిజిటల్‌ వ్యవస్థలో వచ్చిన అనూహ్య మార్పులతో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) సీట్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. సివిల్‌, మెకానికల్‌లాంటి కోర్సుల్లో డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు ఫీజు తగ్గిస్తామన్నా విద్యార్థులు, తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా కళాశాలలు సీఎస్‌ఈ, ఎమర్జింగ్‌(కొత్త) కోర్సులతో కలిపి అధిక సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి.

cse seats
cse seats
author img

By

Published : Oct 27, 2021, 10:19 AM IST

గుంటూరులోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్​ కళాశాలలో సీఈఎస్‌, ఎమర్జింగ్‌ కోర్సులతో 12 సెక్షన్లు ఉండగా.. కేఎల్‌యూలో 35 ఏర్పాటు చేశారు. ప్రైవేటు వర్సిటీల్లో విట్‌లో 17, ఎస్‌ఆర్‌ఎంలో 14, విశాఖ గీతంలో 22 సెక్షన్లు ఉన్నాయి. స్వయంప్రతిపత్తి కళాశాలలు సైతం 4-5 సెక్షన్లు నిర్వహిస్తున్నాయి. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీఎస్‌ఈలో కొందరు రూ.లక్షల డొనేషన్లు చెల్లించి మరీ ప్రవేశాలు పొందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కన్వీనర్‌ కోటా కింద 81,597 సీట్లను ప్రకటించగా.. వీటిల్లో 41% సీట్లు సీఎస్‌ఈ, కృతిమేథలాంటి కోర్సుల్లోనే ఉన్నాయి.

పేరు మార్చితే... అంతే సంగతులు

కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌ పేరుతో కాకుండా ఎమర్జింగ్‌ కృత్రిమేథ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి ప్రత్యేక కోర్సుల కోడ్‌ పెడితే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. నిరుడు మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ కోడ్‌తో ఉన్నవి 93.95% సీట్లు భర్తీ కాగా... ఎమర్జింగ్‌ కోర్సుల కోడ్‌తో ఉన్నవి 65% మాత్రమే నిండాయి. కంప్యూటర్‌ సైన్సులో భాగంగా కొత్త కోర్సులు ఉంటేనే ఎంచుకుంటున్నారు. గతేడాది కన్వీనర్‌ కోటాలో 99,282 సీట్లు ఉండగా 75,140 నిండాయి. సీఈఎస్‌లో మాత్రం 95శాతంపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఎమర్జింగ్‌ కోర్సులతో కలిపి కంప్యూటర్‌ సైన్సులో కన్వీనర్‌ కోటా 33,183 సీట్లుండగా.. వీటిలో సీఎస్‌ఈ కోడ్‌తో లేనివి కేవలం 3,452 మాత్రమే ఉన్నాయి.

కోర్‌ కోర్సులకు దూరం దూరం

ప్రస్తుతం ప్రాంగణ నియామకాలంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే అన్న చందంగా మారింది. కొవిడ్‌ కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల నియామకాలూ పెరిగాయి. సివిల్‌, మెకానికల్‌లాంటి కోర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఎంపిక కోసం గతంలో ఏపీలోని కళాశాలలకు వచ్చిన ఉత్పత్తి, నిర్మాణ కంపెనీలు ఇప్పుడు దాదాపుగా రావడం లేదు. రాష్ట్రంలో కొత్త నిర్మాణాలు లేకపోవడం, కేంద్ర సంస్థలు గేట్‌ మార్కుల ఆధారంగానే నియామకాలను చేపట్టడంతో విద్యార్థులు వీటిపై ఆసక్తి చూపడం లేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతో పోల్చితే కోర్‌ ఇంజినీరింగ్‌లో ప్రారంభ వేతనాలు తక్కువగా ఉండటమూ మరోకారణం. విశాఖలోని ఓ డీమ్డ్‌ వర్సిటీలో ఏడాదికి రూ.3లక్షల వరకు ఫీజు ఉండగా.. రూ.2లక్షల వరకు తగ్గిస్తామన్నా స్పందన కరవైంది. వీటిల్లో చేరుతున్న వారిలోనూ చదివిన బ్రాంచిలో ఉద్యోగం రాకుంటే కోడింగ్‌, పైథాన్‌లాంటి కోర్సులు నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లిపోతుండటం గమనార్హం. ఉత్తరాదితోపాటు తమిళనాడులో మాత్రమే కోర్‌ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి:

BADVEL BY-POLL : బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.