తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను దిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా నూతన వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచి ఏ మార్గంలోనైనా దిల్లీ వచ్చే వారు కొవిడ్ నెగెటివ్ ఉన్న ఆర్టీపీసీఆర్ ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని మే 6న కేజ్రీవాల్ సర్కారు ఆదేశాలు జారీచేసింది. అలా వచ్చిన వారూ ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాలని పేర్కొంది. ధ్రువీకరణ పత్రం లేకుండా వస్తే 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. తాజాగా ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్న దిల్లీ ప్రభుత్వం వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను ఆదేశించింది.
ఇదీ చదవండి: Nominated Posts: త్వరలో 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!